ముగ్గురు టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్లు ఒకేచోట.. సాంగ్‌తో రచ్చలేపారు! | Mani Sharma, Koti, Thaman Perform Athadu Movie Song | Sakshi
Sakshi News home page

ఒకేచోట మణిశర్మ, తమన్‌, కోటి.. ఆ సూపర్‌ హిట్‌ సాంగ్‌ వాయించేశారు!

Jul 11 2025 7:27 PM | Updated on Jul 11 2025 8:08 PM

Mani Sharma, Koti, Thaman Perform Athadu Movie Song

రీరిలీజ్‌ ట్రెండ్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది. మహేశ్‌బాబు (Mahesh Babu) బర్త్‌డేను పురస్కరించుకుని అతడు మూవీ ఆగస్టు 9న మరోసారి విడుదల కానుంది. ఈ చిత్రాన్ని థియేటర్‌లో ఎప్పుడెప్పుడు చూస్తామా? అని మహేశ్‌ అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కౌంట్‌డౌన్‌ కూడా మొదలుపెట్టేశారు. ఇకపోతే త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2005 ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

20 ఏళ్ల తర్వాత రీరిలీజ్‌
త్రిష కథానాయికగా నటించగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ (Mani Sharma) సంగీతం అందించాడు. బాక్సాఫీస్‌ వద్ద రచ్చ లేపిన ఈ మూవీకి మూడు నంది అవార్డులు వరించాయి. ఈ సూపర్‌ హిట్‌ చిత్రం 20 ఏళ్ల తర్వాత మరోసారి థియేటర్లలో సందడి చేయనున్న నేపథ్యంలో ఓ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అందులో టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్లు కోటి, తమన్‌, మణిశర్మ ఒకే పాటకు సంగీతం వాయించారు. అతడు సినిమాలోని అవును నిజం.. నువ్వంటే నాకిష్టం సాంగ్‌ మ్యూజిక్‌ ట్రాక్‌ వాయించారు. 

ముగ్గురు మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ ఒకేచోట
నిజానికి ఈ వీడియో ఇప్పటిది కాదు, మూడేళ్ల కిందటిది. నా గురువులు మణిశర్మ, కోటి గార్లతో ఓ అద్భుతమైన రోజు అని గతంలో తమన్‌ స్వయంగా ఈ వీడియో షేర్‌ చేశాడు. అతడు రీరిలీజ్‌ నేపథ్యంలో అది మరోసారి వైరల్‌ అవుతోంది. మణిశర్మ దగ్గర తమన్‌ దాదాపు ఎనిమిదేళ్లపాటు అసిస్టెంట్‌గా పని చేశాడు. తనదైన స్టైల్‌లో ట్యూన్స్‌ ఇస్తూ ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా రాణిస్తున్నాడు.

చదవండి: ఆ రెండు సాంగ్స్‌ లేకుంటే కన్నప్ప మళ్లీ చూసేవాళ్లం.. అది మా బుద్ధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement