సందీప్‌ వంగాతో వివాదం.. తండ్రి తిట్టాడనే అనుకున్నా: రధన్‌ | Music Director Radhan Responds On Sandeep Reddy Vanga Arjun Reddy Movie Controversy, Check Out More Insights | Sakshi
Sakshi News home page

Radhan: అర్జున్‌ రెడ్డిలో చెత్త మ్యూజిక్‌ అయితే ఇవ్వలేదు, తండ్రిలా తిట్టాడనుకున్నా..

Apr 10 2025 2:19 PM | Updated on Apr 10 2025 2:52 PM

Arjun Reddy Music Director Radhan Responds On Sandeep Reddy Vanga Issue

అర్జున్‌ రెడ్డి సినిమా (Arjun Reddy)కు ఇద్దరు మ్యూజిక్‌ డైరెక్టర్లు పని చేశారు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ హర్షవర్దన్‌ రామేశ్వర్‌ ఇస్తే పాటలకు రధన్‌ సంగీతం అందించాడు. అతడు అందించిన పాటలు బ్లాక్‌బస్టర్‌ మ్యూజికల్‌ హిట్స్‌గా నిలిచాయి. అయితే సరైన సమయానికి పాటలు ఇవ్వకుండా నా టైం మొత్తం వృధా చేశాడని దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా రధన్‌పై విమర్శలు గుప్పించాడు. సిద్దార్థ్‌ రాయ్‌ సినిమా దర్శకుడు కూడా రధన్‌ చెప్పిన సమయానికి పాటలు ఇవ్వకపోగా ఫోన్లు కూడా లిఫ్ట్‌ చేసేవాడు కాదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

ఆయన తండ్రిలాంటి వారు
ఇలా రధన్‌ వల్ల సినిమా లేటైందని దర్శకులు తిట్టుకున్నారు. తాజాగా ఈ వివాదంపై రధన్‌ స్పందించాడు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా (Akkada Ammayi Ikkada Abbayi Movie) ఈవెంట్‌లో అతడు మాట్లాడుతూ.. సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) నాకు తండ్రిలాంటివారు. తండ్రి తిడితే ఆయన తిట్టారని ప్రచారం చేసుకోలేం. నాన్న మనల్ని కాకపోతే ఎవర్ని తిడతారు? దాన్ని పట్టించుకోకూడదు. ఎందుకంటే ఆయన తండ్రిలాంటివారు కాబట్టి!

అనుదీప్‌ తల్లిలా..
ఆయన నన్ను తిట్టిన తర్వాత కూడా అనుదీప్‌ (జాతిరత్నాలు), ప్రదీప్‌ మాచిరాజు (అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి) నాపై నమ్మకంతో సినిమా ఆఫర్‌ ఇచ్చారు. అంతర్గత విభేదాలు తలెత్తినప్పుడు కొన్ని పట్టించుకోవాలి, కొన్నింటిని పట్టించుకోకూడదు. సందీప్‌ ఎప్పుడూ అలాగే ఉంటారు. ఒక తండ్రిగా తిట్టారు, తిడతారు. నేనైతే అవేవీ మనసుకు ఎక్కించుకోలేదు. నాన్న తిట్టాడని ఫీలయ్యానంతే! అర్జున్‌ రెడ్డిలో నేను చెత్త మ్యూజిక్‌ అయితే ఇవ్వలేదు కదా.. మంచి సంగీతం ఇచ్చానన్న తృప్తి ఉంది. అనుదీప్‌ నాకు తల్లిగా అనిపించారు. కొందరు తిడతారు, మరికొందరు దగ్గరకు తీసుకుంటారు. అందరూ ఒకేలా ఉండరు అని రధన్‌ వివరణ ఇచ్చాడు.

చదవండి: లక్షలు పెట్టి టికెట్‌ తీసుకుంటే సెల్ఫీ కూడా లేదు.. హృతిక్‌పై అభిమానుల ఆగ్రహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement