కోట శ్రీనివాసరావు మృతిపట్ల ప్రధాని మోదీ సంతాపం | PM Narendra Modi Pay Tribute To Kota Srinivasa Rao | Sakshi
Sakshi News home page

కోట శ్రీనివాసరావు మృతిపట్ల ప్రధాని మోదీ సంతాపం

Jul 13 2025 5:58 PM | Updated on Jul 13 2025 6:56 PM

PM Narendra Modi Pay Tribute To Kota Srinivasa Rao

న్యూఢిల్లీ:  టాలీవుడ్‌ ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. కోట శ్రీనివాసరావు  మరణం బాధాకరమని, ఆయన సినీ ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞగా ఆయన గుర్తిండిపోతారని మోదీ కొనియాడారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. 

‘కోట శ్రీనివాసరావు గారి మరణం బాధాకరం. ఆయన సినీ ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞకు గుర్తుండిపోతారు. తరతరాలుగా ప్రేక్షకులను తన అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. సామాజిక సేవలో కూడా ఆయన ముందంజలో ఉన్నారు మరియు పేదలు మరియు అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడానికి కృషి చేశారు. ఆయన కుటుంబానికి, అసంఖ్యాక అభిమానులకు నా సంతాపం. ఓం శాంతి.’ అని ‘ఎక్స్‌’ ఖాతా ద్వారా సంతాపం తెలిపారు.

 

ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న నటుడు

ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు  మరణం బాధాకరం. తన అద్భుతమైన నటనా ప్రతిభతో కోట ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. ఆయన సినిమాకు చేసిన సేవలకు గాను ఆయనకు 2015లో పద్మశ్రీ అవార్డు లభించింది.  ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిన్నా’ అని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సంతాపం తెలిపారు.


 ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement