
'మన మాతృభాష అమ్మ అయితే హిందీ పెద్దమ్మ' అని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. దీంతో ఒక్కసారిగా దక్షిణాది రాష్ట్రాలు మండిపడుతున్నాయి. ఒకప్పుడు హిందీ గో బ్యాక్ అనే నినాదాన్ని ఇచ్చిన పవన్ ఇప్పుడు 'ఏ మేరా జహా' అంటూ హిందీ రాగం ఎత్తుకున్నాడు. హిందీ అందరినీ ఏకం చేస్తుందంటూ పాఠాలు చెప్పాడు. ఆయన వ్యాఖ్యలు కేవలం పొలిటికల్ వర్గాల నుంచి మాత్రమే కాకుండా అందరి నుంచి తీవ్ర వ్యతిరేఖత వచ్చింది. సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి పీకేను తప్పుబడుతూ కామెంట్లు వస్తున్నాయి. పవన్ వ్యాఖ్యలను సమర్ధించడానికి జనసేన సోషల్ మీడియా వింగ్ కూడా కిందా మీదా అవుతోంది. #POLITICALJOKERPK అనే హ్యాష్‌ట్యాగ్ సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతుంది. కేవలం కొన్ని గంటల్లోనే పవన్‌కు కౌంటర్‌గా పది లక్షలకు పైగా ట్వీట్లు పడ్డాయి. తాజాగా ప్రముఖ సినీ నటులు ప్రకాశ్‌రాజ్ కూడా స్పందించారు.
గచ్చిబౌలి స్టేడియంలో ‘రాజభాష విభాగం స్వర్ణోత్సవ సమ్మేళనం’ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ మండిపడ్డారు. తన ఎక్స్ పేజీలో పవన్ చేసిన కామెంట్స్ను చేర్చి 'ఈ range కి అమ్ముకోవడమా ….ఛి…ఛీ… #justasking' అంటూ ఆయన ఫైర్ అయ్యారు. దీంతో ప్రకాశ్రాజ్కు కూడా చాలామంది సపోర్ట్గా ఆయన చేసిన పోస్ట్ను షేర్ చేస్తున్నారు. ఇదే సమయంలో హిందీ బాషపై గతంలో పవన్ వేసిన ట్వీట్లు, మాట్లాడిన మాటలను వైరల్ చేస్తున్నారు. అప్పడేమో హిందీ గో బ్యాక్ అని పిలుపునిచ్చిన పవన్ ఇప్పుడు కేవలం కేంద్రంలోని బీజేపీ అజెండాను మోస్తున్నట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.హిందీ మింగేసిన భాషలు ఎన్నో తెలుసా..?

హిందీ మింగేసిన భాషలు ఎన్నో తెలుసా..?
1955లో వచ్చిన భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రతిపాదన ప్రకారం మధ్యప్రదేశ్, బిహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల అధికార భాషగా హిందీని పేర్కొంది. ఒక భాషకుఅంత విస్తారమైన ప్రాంతాన్ని కేటాయించడం ప్రమా దకరం అని ఆందోళన వ్యక్తం చేసిన వారిలో బీఆర్ అంబేడ్కర్ కూడా ఉన్నారు. ఎందుకయినా మంచిది ఉత్తరప్రదేశ్‌ను నాలుగు భాగాలు చేయాలని ఆయన అప్పుడే సూచించారు. ఇప్పుడు అంబేడ్కర్ భయపడి నట్టే ఇప్పుడు జరుగుతోంది. గడిచిన 70 సంవత్సరాల్లో భోజ్ పురి, మైథిలి, గఢ్వాలి, అవధి, బ్రజ్‌లతో సహా దాదాపు 29 స్థానిక భాషల్ని హిందీ మింగేసింది. అది అక్కడితో ఆగలేదు. ఇప్పుడు ఏకంగా ఇండియాను మింగడానికి సిద్ధం అయింది. అందుకే హిందీ భాషను మాపై రుద్దకండి అంటూ విశ్లేషకులు కోరుతున్నారు.
ఈ range కి అమ్ముకోవడమా ….ఛి…ఛీ… #justasking https://t.co/Fv9iIU6PFj
— Prakash Raj (@prakashraaj) July 11, 2025