
రవి కిరణ్ హీరోగా నటించిన మైథలాజికల్ చిత్రం 'గదాధారి హనుమాన్’. ఈ మూవీకి రోహిత్ కొల్లి దర్శకత్వం వహించారు. విరభ్ స్టూడియో బ్యానర్ మీద రేణుకా ప్రసాద్, బసవరాజ్ హురకడ్లి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాను తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ఈవెంట్‌కు ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్, రాజ్ కందుకూరి, డైరెక్టర్ సముద్ర ముఖ్య అతిథులుగా టీజర్ రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత కళ్యాణ్ మాట్లాడుతూ .. 'హనుమాన్ సినిమాను నేనే ప్రారంభించా. ప్రశాంత్ వర్మకి నాతోనే సినిమాను ప్రారంభించాలనే ఓ సెంటిమెంట్ ఉంటుంది. ఆ హనుమాన్ ఎలా హిట్ అయిందో.. ఈ ‘గదాధారి హనుమాన్’ కూడా అంతే స్థాయిలో హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. హనుమాన్‌ను నమ్ముకున్న వారంతా విజయాన్ని సాధిస్తారు. టీజర్ అద్భుతంగా ఉంది. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో వస్తోన్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.
రాజ్ కందుకూరి మాట్లాడుతూ .. ‘‘గదాధారి హనుమాన్’ టైటిల్ చాలా బాగుంది. ఈ టైటిల్‌ను పెట్టుకుని సినిమా తీసిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. రవి కిరణ్ ఇది వరకే నాకు కథ చెప్పారు. క్లైమాక్స్ అద్భుతంగా ఉండబోతోంది. ఇలాంటి చిత్రాలు ఇప్పుడు ఎక్కువగా ఆడుతున్నాయి. సినిమాలో కంటెంట్ ఉంటే చిన్నదా? పెద్దదా? అన్న తేడాని ఆడియెన్స్ చూడటం లేదు. రవి కిరణ్ ఈ మూవీతో సూపర్ స్టార్ అవుతారనిపిస్తోంది. ఈ చిత్రం కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది’ అని అన్నారు.
దర్శకుడు రోహిత్ మాట్లాడుతూ .. ‘‘గదాధారి హనుమాన్’ సినిమాతో నేను మూడేళ్లు ప్రయాణం చేశా. బసవ సర్‌తో ఈ జర్నీ ప్రారంభమైంది. అప్పుడు చాలా సింపుల్ కాన్సెప్ట్‌తో మూవీ అనుకున్నాం. కానీ రవి జాయిన్ కావడంతో స్పాన్ మారిపోయింది. అందుకే ఇప్పుడు ఇలా పాన్ ఇండియా స్థాయిలో మూవీని తీసుకు వస్తున్నాం. రవి కిరణ్ ఈ చిత్రంలో అన్ని రకాల ఎమోషన్స్‌ను అద్భుతంగా పండించారు. హర్షిత చక్కగా నటించారని' తెలిపారు
హీరో రవి కిరణ్ మాట్లాడుతూ .. ‘మా కోసం వచ్చిన రాజ్ కందుకూరికి థాంక్స్. ఈ చిత్రాన్ని ఇంత గొప్పగా నిర్మించిన మా నిర్మాతలు బసవరాజ్, రేణుకా ప్రసాద్ గారికి థాంక్స్. మొదట్లో ఈ సినిమాను చాలా చిన్నగా చేయాలని అనుకున్నాం. కానీ ఆ హనుమాన్ ఇచ్చిన సపోర్ట్, శక్తి వల్లే ఈ సినిమాను ఇంతటి స్థాయిలో తెరకెక్కించగలిగాం. క్లైమాక్స్ చాలా కాంప్లికేటెడ్‌గా ఉంటుంది. నేను చిరంజీవికి పెద్ద అభిమానిని. ఆయనకు హనుమాన్ అంటే ఇష్టం. ఆ ఇద్దరి ఆశీస్సులు మా సినిమాపై ఉంటాయని భావిస్తున్నా. చిన్న వాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకు మా సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.