జపాన్‌లో దేవర ఫీవర్.. ఆయుధ పూజ సాంగ్‌కు ఫ్యాన్స్ స్టెప్పులు | Jr NTR Dance With Fans at japan in Devara Movie Promotions | Sakshi
Sakshi News home page

Devara Movie: జపాన్‌లో దేవర..ఆయుధ పూజ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన ఎన్టీఆర్

Published Mon, Mar 24 2025 5:30 PM | Last Updated on Mon, Mar 24 2025 6:10 PM

Jr NTR Dance With Fans at japan in Devara Movie Promotions

జూనియర్ ఎన్టీఆర్‌- కొరటాల శివ కాంబోలో వచ్చిన ఫుల్ యాక్షన్‌ మూవీ దేవర పార్ట్-1. గతేడాది థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. విడుదలైన కొద్ది రోజుల్లోనే రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటించింది. సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. 

అయితే మన టాలీవుడ్ సినిమాలకు జపాన్‌లో క్రేజ్‌ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను జపాన్‌లోనూ విడుదల చేయనున్నారు. ఇప్పటికే మన యంగ్‌ టైగర్‌ జపాన్ చేరుకుని ప్రమోషన్లతో బిజీ ‍అయిపోయారు. తాజాగా ‍అక్కడి ఫ్యాన్స్‌తో కలిసి ఓ థియేటర్లో సందడి చేశారు.

ఈ సందర్భంగా దేవర మూవీలోని ఆయుధ పూజ సాంగ్‌కు జపాన్ ఫ్యాన్స్ డ్యాన్స్ చేశారు. వారితో కలిసి మన జూనియర్ ఎన్టీఆర్ సైతం స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియోను దేవర టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. కాగా.. దేవరను మార్చి 28న జపాన్‌లో విడుదల కానుందని మేకర్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్ కావడంతో దేవర-2 కూడా ఉంటుందని డైరెక్టర్‌ కొరటాల ఇప్పటికే ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement