హీరో సందీప్‌ కిషన్‌ ఇంట విషాదం | Sundeep Kishan Grandmother Passed Away | Sakshi
Sakshi News home page

హీరో సందీప్‌ కిషన్‌ ఇంట విషాదం

Jun 18 2025 11:35 AM | Updated on Jun 18 2025 11:47 AM

Sundeep Kishan Grandmother Passed Away

విశాఖపట్నం(కంచరపాలెం): టాలీవుడ్‌ యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ ఇంట విషాదం నెలకొంది. ఆయన నానమ్మ, జ్ఞానాపురం సిరిల్‌ వీధికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయిని శ్రీపాదం ఆగ్నేసమ్మ(88) సోమవారం అర్ధరాత్రి కన్నుమూశారు. మంగళవారం సెయింట్‌ పీటర్స్‌ కేథడ్రల్‌ చర్చి సెమెట్రీలో ఆమె భూస్థాపన నిర్వహించారు. విశాఖలోని పలు ప్రాంతాల్లో ఉపాధ్యాయినిగా పనిచేసిన ఆగ్నేసమ్మ.. వృత్తిలో ఉన్న సమయంలో ఎంతోమంది పేద పిల్లలను చదివించి, వారి అవసరాలు తీర్చి అండగా నిలిచారు. 

ఆగ్నేసమ్మ పెద్ద కుమారుడు రవి తనయుడు, ప్రముఖ హీరో సందీప్‌ కిషన్‌ మద్రాసులో స్థిరపడినప్పటికీ, జ్ఞానాపురంలో తమ బంధువులతో సంబంధాలను కొనసాగిస్తున్నారు. తనకు ఎంతో ఇష్టమైన నానమ్మ(ఆగ్నేసమ్మ) మరణవార్త విని చలించిపోయిన సందీప్‌ కిషన్‌..తన మేనమామ, ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ ఛోటా కె.నాయుడు, కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం ఇక్కడకు చేరుకున్నారు. ఆగ్నేసమ్మ భూ స్థాపన కార్యక్రమంలో పాల్గొని ఆమెకు నివాళులర్పించారు. సెయింట్‌ పీటర్స్‌ చర్చి పరిసరాల్లో పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement