breaking news
Chota K. Naidu
-
హీరో సందీప్ కిషన్ ఇంట విషాదం
విశాఖపట్నం(కంచరపాలెం): టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఇంట విషాదం నెలకొంది. ఆయన నానమ్మ, జ్ఞానాపురం సిరిల్ వీధికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయిని శ్రీపాదం ఆగ్నేసమ్మ(88) సోమవారం అర్ధరాత్రి కన్నుమూశారు. మంగళవారం సెయింట్ పీటర్స్ కేథడ్రల్ చర్చి సెమెట్రీలో ఆమె భూస్థాపన నిర్వహించారు. విశాఖలోని పలు ప్రాంతాల్లో ఉపాధ్యాయినిగా పనిచేసిన ఆగ్నేసమ్మ.. వృత్తిలో ఉన్న సమయంలో ఎంతోమంది పేద పిల్లలను చదివించి, వారి అవసరాలు తీర్చి అండగా నిలిచారు. ఆగ్నేసమ్మ పెద్ద కుమారుడు రవి తనయుడు, ప్రముఖ హీరో సందీప్ కిషన్ మద్రాసులో స్థిరపడినప్పటికీ, జ్ఞానాపురంలో తమ బంధువులతో సంబంధాలను కొనసాగిస్తున్నారు. తనకు ఎంతో ఇష్టమైన నానమ్మ(ఆగ్నేసమ్మ) మరణవార్త విని చలించిపోయిన సందీప్ కిషన్..తన మేనమామ, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఛోటా కె.నాయుడు, కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం ఇక్కడకు చేరుకున్నారు. ఆగ్నేసమ్మ భూ స్థాపన కార్యక్రమంలో పాల్గొని ఆమెకు నివాళులర్పించారు. సెయింట్ పీటర్స్ చర్చి పరిసరాల్లో పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. -
Chota K. Naidu: కుటుంబంతో తిరుమల శ్రీవారిని సందర్శించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ (ఫోటోలు)
-
వెంకటేశ్వరస్వామికి థ్యాంక్స్ : ఛోటా కె. నాయుడు
‘‘సంజు (సందీప్) ఓ కథ తీసుకొచ్చి, నన్ను వినమన్నాడు. నాకు బాగా నచ్చింది. ముఖ్యంగా స్క్రీన్‌ప్లే బాగా నచ్చింది. ‘ఠాగూర్’ మధుకి ఈ కథ చెబితే, చేద్దామన్నారు. గ్యారంటీ హిట్ అనే నమ్మకంతో ఈ చిత్రం చేశాం. మొదటి మూడు రోజుల్లో దాదాపు ఆరు కోట్లు వసూలు చేసి, మాకు ఘనవిజయాన్ని ఇచ్చింది. ఈ సందర్భంగా ఆ వెంకటేశ్వర స్వామికి ధన్యవాదాలు చెప్పాలి’’ అని ఛాయాగ్రాహకుడు ఛోటా కె. నాయుడు అన్నారు. సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్, సీరత్‌కపూర్ ముఖ్య పాత్రల్లో వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ‘టైగర్’ ఇటీవలే విడులైంది. ఈ చిత్రం సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో ఛోటా ఇంకా మాట్లాడుతూ -‘‘ ‘టైగర్’ ముగిసిన తర్వాత మొక్కు అంటూ తిరుపతి వెళ్లి, సంజు తలనీలాలు సమర్పించాడు. కానీ, ఇంకా ఏదో సన్నివేశాలు తీయాల్సి వచ్చింది. గుండుతో ఉన్నాడు కాబట్టి, విగ్ తయారు చేయిస్తే, అది సెట్ కాలేదు. దాంతో మూడు నెలలు ఆగాం. ఈ గ్యాప్‌లో ఎడిటింగ్ మీద బాగా దృష్టి పెట్టాం. అది చిత్రవిజయానికి దోహదపడింది. అందుకే, ఆ వెంకటేశ్వరుడికి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘ఈ సినిమా అందరం చాలా ఇష్టపడి చేశాం. టైటిల్ మాస్‌గా ఉన్నా కూడా ఆడియన్స్ అందరూ ఈ చిత్రాన్ని ఇష్టపడుతున్నారు. ఈ సినిమా ఫలితం విని ఏడ్చేశాను’’ అని సందీప్ కిషన్ అన్నారు. రజనీకాంత్, చిరంజీవి వంటి సూపర్‌స్టార్స్‌తో పనిచేసిన చోటా. కె. నాయుడుగారితో పనిచేయడం చాలా ఆనందంగా ఉందని రాహుల్ రవీంద్రన్ అన్నారు. ‘‘ఈ కథ పై నమ్మకంతో సందీప్ మెయిన్ పిల్లర్‌గా నిలిచారు. అబ్బూరి రవి డైలాగ్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది’’ అని దర్శకుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర సమర్పకులు ‘ఠాగూర్’ మధు, తాగుబోతు రమేశ్, సప్తగిరి, సీనియర్ దర్శకుడు ధవళ సత్యం తదితరులు పాల్గొన్నారు. -
బీరువా మూవీ ప్రెస్ మీట్