సేవకు మారు పేరు, ఐఏఎస్ ఆఫీసర్‌ బీలా వెంకటేశన్ ఇకలేరు | IAS Officer Beela Venkatesan Passes Away | Known for COVID-19 Service in Tamil Nadu | Sakshi
Sakshi News home page

సేవకు మారు పేరు, ఐఏఎస్ ఆఫీసర్‌ బీలా వెంకటేశన్ ఇకలేరు

Sep 25 2025 11:35 AM | Updated on Sep 25 2025 12:41 PM

Tamil Nadu IAS Beela VenkatesanHealth Secretary during COVID passes away

కరోనా (corina) సమయంలో రాష్ట్రానికి కీలక సేవలు అందించిన ఐఏఎస్ అధికారిణి బీలా వెంకటేశన్ (Beela Venkatesan) (56) ఇక లేరు. ప్రజా సేవకు, అంకితభావానికి పేరుగాంచిన ఉన్నతాధికారిణి, తమిళనాడు ఇంధన శాఖ కార్యదర్శిగా  బీలా  బుధవారం (సెప్టెంబర్ 24న) అనారోగ్యంతోకన్నుమూశారు.గత కొన్నేళ్లుగా బ్రెయిన్ ట్యూమర్‌తో పోరాడుతున్నారు.  ఆమె మరణంపై పలువురు సంతాపం ప్రకటించారు. పాలన  ప్రజా సంక్షేమం పట్ల ఆమెకున్న నిబద్ధత మరువలేనిదని గుర్తు చేసుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్  ఆమెకు నివాళులర్పించారు,

2020లో కోవిడ్-19 మహమ్మారి సమయంలో వెంకటేశన్ తమిళనాడులో సుపరిచితం.ఆ సమయంలో రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శిగా, రాష్ట్రంలో కోవిడ్-19 పరిస్థితికి సంబంధించి తన రోజువారీ మీడియా బ్రీఫింగ్‌ల ద్వారా కీలకమైన నవీకరణలను అందిస్తూ తమిళనాట బహుళ ప్రజాదరణ పొందారు.

డాక్టర్ బీలా వెంకటేశన్ మద్రాస్ మెడికల్ కాలేజీ (ఎంఎంసి) నుండి ఎంబిబిఎస్ పూర్తి చేశారు. వృత్తిరీత్యా వైద్యురాలైన 1997లో సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణురాలైంది. మొదట బీహార్, ఆ తరువాత జార్ఖండ్‌లోనూ పనిచేసి అనంతరం తమిళనాడుకు బదిలీ అయ్యారు.

తమిళనాడులో, ఆమె చెంగల్పట్టు సబ్-కలెక్టర్‌గా పనిచేశారు; ఫిషరీస్ కమిషనర్;  కమీషనర్ ఫర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్; ఆరోగ్య ప్రధాన కార్యదర్శి,ఇండియన్ మెడిసిన్ అండ్‌ హోమియోపతికి కమిషనర్‌గా విశేష సేవలందించారు.

బీలా తల్లి, నాగర్‌కోయిల్‌కు చెందిన రాణి వెంకటేశన్ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు  మాజీ ఎమ్మెల్యే. ఆమె తండ్రి, SN వెంకటేశన్ రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement