టాలీవుడ్ ప్రముఖ నిర్మాత కన్నుమూత | Producer Teneteega Rama Rao Passed Away | Sakshi
Sakshi News home page

Producer: సినిమాని ఇంటిపేరుగా మార్చుకున్న నిర్మాత మృతి

May 4 2025 8:18 PM | Updated on May 4 2025 8:21 PM

Producer Teneteega Rama Rao Passed Away

టాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత రామారావు(68) మృతి చెందారు. గత కొన్నాళ్లుగా కాలేయ సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఈయన.. ఆదివారం పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

(ఇదీ చదవండి: తెలుగు డైరెక్టర్ అని తొక్కేశారు.. లేదంటే విజయ్ తో సినిమా! 

90ల్లో నరేష్, రాజేంద్ర ప్రసాద్ తదితర హీరోలతో ఎక్కువగా సినిమాలు తీశారు. తేనెటీగ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈయనకు ఈ పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్నారు. ఈయన అసలు పేరు జవ్వాజి వెంకట రామారావు.

తేనెటీగ సినిమాతో పాటు ప్రేమ అండ్ కో, బొబ్బిలి వేట, బడి తదితర సినిమాలని నిర్మించారు. ఈయనకు భార్యతో పాటు కొడుకు కూతురు ఉన్నారు. కొన్ని డబ్బింగ్ చిత్రాలని కూడా ఆయన తెలుగులో రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: బాలీవుడ్ లో మర్యాద ఇవ్వరు.. యంగ్ హీరో కన్నీళ్లు 

Advertisement
 
Advertisement
Advertisement