తెలుగు డైరెక్టర్ అని తొక్కేశారు.. లేదంటే విజయ్ తో సినిమా! | Director Gopichand Malineni Talks About His Movie With Thalapathy Vijay | Sakshi
Sakshi News home page

Gopichand Malineni: దళపతి ఆఫర్ ఇచ్చినా.. అవకాశం రానివ్వకుండా చేసి

May 4 2025 4:33 PM | Updated on May 4 2025 5:02 PM

Gopichand Malineni About Thalapathy Vijay Movie

ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్. తెలుగు డైరెక్టర్లు తమిళ, మలయాళ హీరోలతో.. ఆయా భాషల్లోని దర్శకులు తెలుగు హీరోలతో సినిమాలు తీస్తున్నారు. ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. ‍అయితే ఓ తెలుగు దర్శకుడికి చేతిదాకా వచ్చిన ఓ భారీ ఛాన్స్.. కొద్దిలో మిస్సయింది. తాను టాలీవుడ్ వాడిని కావడమే దీనికి కారణమని చెప్పుకొచ్చాడు. 

(ఇదీ చదవండి: తెలుగు హీరోతో మృణాల్ ప్రేమ? నిజమేంటి? 

రీసెంట్ గా 'జాట్' మూవీలతో ఆకట్టుకున్న తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని.. అంతకు ముందు బాలయ్యతో 'వీరసింహారెడ్డి' తీసి హిట్ కొట్టాడు. అయితే ఈ సినిమా తర్వాత తమిళ హీరో విజయ్ ని కలిసి ప్రాజెక్ట్ చేసేందుకు ఒప్పించానని, కానీ చివరి నిమిషంలో తప్పుకోవాల్సి వచ్చిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అందుకు గల కారణాల్ని కూడా బయటపెట్టాడు.

'వీరసింహారెడ్డి తర్వాత వెంటనే స్టోరీ రెడీ చేసుకుని తమిళ హీరో విజయ్ ని చెప్పాను. ఆయనకు నచ్చేసింది. సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేశారు. అనౌన్స్ చేద్దాం అనుకుంటున్న టైంలో తర్వాత నుంచి రాజకీయాల్లోకి వెళ్లిపోతారు అన్నప్పుడు తెలుగు డైరెక్టర్ కాదు తమిళ డైరెక్టర్ అయితే బాగుంటుందని లోకల్ వాళ్ల నుంచి ప్రెజర్ ఉంది. దీని ముందు వారిసు (వారసుడు) అని తెలుగు దర్శకుడితో చేశారు. మళ్లీ తెలుగు డైరెక్టర్ తో అంటే తమిళ వాళ్లందరు కూడా తెలుగోళ్లని తీసుకొచ్చి చేస్తే కరెక్ట్ కాదని ఆయనకు చెప్పారేమో. అలా ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది' అని గోపీచంద్ మలినేని చెప్పుకొచ్చాడు.

వీరసింహారెడ్డి తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేని.. విజయ్ తో సినిమా అనుకున్నాడు. ఆ ప్రాజెక్ట్ రద్దయింది. ‍రవితేజతో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఓ మూవీ అనౌన్స్ చేశారు. కారణమేంటో గానీ దీన్ని పక్కనబెట్టేశారు. ఫైనల్ గా హిందీలో 'జాట్' ‍అనే మూవీ తీశాడు. గత నెలలో రిలీజైన ఈ చిత్రం ఓ మోస్తరుగా ఆడింది. త్వరలోనే ఈ దర్శకుడు బాలయ్యతో మరో మూవీ చేయబోతున్నాడు.

(ఇదీ చదవండి: టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా 'టూరిస్ట్ ఫ్యామిలీ' 

Advertisement
 
Advertisement
Advertisement