టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా 'టూరిస్ట్ ఫ్యామిలీ' | Tourist Family Movie Telugu Review And Analysis | Sakshi
Sakshi News home page

Tourist Family: 'టూరిస్ట్ ఫ్యామిలీ'.. ఏంటి దీని సంగతి?

May 3 2025 7:05 PM | Updated on May 3 2025 7:52 PM

Tourist Family Movie Telugu Review And Analysis

చిన్న లేదా తక్కువ బడ్జెట్ తో తీసిన సినిమాలని.. స్టార్ హీరోల చిత్రాలకు పోటీగా రిలీజ్ చేసేందుకు కాస్త ఆలోచిస్తారు. కొన్నిసార్లు ఇది మైనస్ అయితే మరికొన్నిసార్లు ప్లస్ అవ్వొచ్చు. తాజాగా తమిళంలో సూర్య 'రెట్రో'కి పోటీగా రిలీజైన ఓ చిన్న మూవీకి ఇలానే ప్లస్ అయినట్లు కనిపిస్తుంది. ఇంతకీ ఏంటా సినిమా? దాని సంగతేంటి?

(ఇదీ చదవండి: కొత్త రికార్డ్.. మహేశ్ బాబు తర్వాత నానినే 

తెలుగులో ఈ వారం హిట్ 3 రిలీజైంది. సక్సెస్ అందుకుంది. తమిళంలో సూర్య రెట్రో విడుదలైంది. కానీ పాజిటివ్ టాక్ రాలేదు. మిశ్రమ స్పందన వచ్చింది. ఈ వీకెండ్ దాటితే రిజల్ట్ పై ఓ క్లారిటీ వచ్చేస్తుంది. ఈ చిత్రానికి పోటీగా తమిళంలో 'టూరిస్ట్ ఫ్యామిలీ' అనే హార్ట్ టచింగ్ కామెడీ డ్రామా రిలీజైంది. పెద్దగా అంచనాల్లేనప్పటికీ ప్రేక్షకులకు తెగ నచ్చేస్తుంది.

ఒకప్పటి హీరోయిన్ సిమ్రాన్ తప్పితే ఇందులో తెలుగువాళ్లకు తెలిసిన ముఖాలేం లేవు. 'టూరిస్ట్ ఫ్యామిలీ' కథ విషయానికొస్తే.. శ్రీలంకకు చెందిన ధర్మదాస్ అనే వ‍్యక్తి.. కొవిడ్ వల్ల ఆర్థికంగా బాగా నష్టపోతాడు. దీంతో ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టుకుని చెన్నైకి వలస వస్తాడు. ఆ తర్వాత తను ఉంటున్న కాలనీ వాసులతో ఎలా కలిసిపోయాడు? వాళ్ల జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చాడనేదే స్టోరీ. 

(ఇదీ చదవండి: రెండో పెళ్లి చేసుకుంటా.. అందరికీ సమాధానమిస్తా: జాను లిరి 

ఈ సినిమాలో సింపుల్ స్టోరీనీ అద్భుతంగా ప్రెజెంట్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. అసలు మనిషి జీవితం ఎలా ఉండాలి? ఆ జీవితం మిగతావారితో కలిసి ఎలా జీవించాలి? ప్రతి మనిషి మరో మనిషికి తోడుగా ఉంటూ ఒకరికి ఒకరు ఎలా సపోర్ట్ చేసుకోవాలి అనే అంశాల్ని ప్రేక్షకుల మనసుకు తాకేలా, చూస్తున్నంతసేపు గుండె బరువెక్కేలా ఈ సినిమాని తీయడం విశేషం.

రెట్రో మూవీకి ఫ్యాన్స్ నుంచి సపోర్ట్ ఉండొచ్చు గానీ 'టూరిస్ట్ ఫ్యామిలీ'కి ఫ్యామిలీ ఆడియెన్స్ సపోర్ట్ గట్టిగా ఉండొచ్చు. ఈ సినిమాని తీసింది ఓ యూట్యూబర్ కావడం ఇక్కడ కొసమెరుపు. ప్రస్తుతానికైతే ఇది తమిళంలో మాత్రం రిలీజైంది. ఓటీటీలోకి వచ్చిన తర్వాత మాత్రం దీన్ని అస్సలు మిస్సవ్వొద్దు.

(ఇదీ చదవండి: 'ఆదిపురుష్' రిజల్ట్ పై దర్శకుడి తెలివితక్కువ వాదన 

Advertisement
 
Advertisement
Advertisement