కొత్త రికార్డ్.. మహేశ్ బాబు తర్వాత నానినే | Nani New Overseas Records With HIT 3 Movie | Sakshi
Sakshi News home page

Nani: 'హిట్ 3'తో రెండు రికార్డులు బ్రేక్ చేసిన నాని

May 3 2025 3:05 PM | Updated on May 3 2025 3:23 PM

Nani New Overseas Records With HIT 3 Movie

హీరో నాని నుంచి లేటెస్ట్ గా 'హిట్ 3' సినిమా వచ్చింది. మే 01న రిలీజైన ఈ చిత్రానిక రెండు రోజుల్లోనే రూ.62 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మూవీపై కొందరికి నచ్చనప్పటికీ.. ఓవరాల్ గా మాత్రం థియేటర్లకు జనాలు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే నాని రెండు సరికొత్త రికార్డ్స్ సృష్టించాడు.

గత కొన్నాళ్ల నుంచి తన ప్రతి సినిమాతో ఆకట్టుకుంటున్న నాని.. ఓవర్సీస్ అంటే విదేశాల్లోనూ తెలుగు ప్రేక్షకుల్ని ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తున్నాడు. హిట్ 3తో వరసగా 11వ సారి మిలియన్ మార్క్ వసూళ్లు సాధించాడు. ఈ క్రమంలోనే మహేశ్ బాబు సరసన చేరాడు. ఇంతకు ముందు మహేశ్ ఈ ఘనత సాధించాడు.

(ఇదీ చదవండి: రెండో పెళ్లి చేసుకుంటా.. అందరికీ సమాధానమిస్తా: జాను లిరి 

మరోవైపు 5 కంటే ఎక్కువగా 1.5 మిలియన్ డాలర్ వసూళ్లు సాధించిన హీరోగానూ నాని నిలిచాడు. ఈ లిస్టులో ఇంతకు ముందు మహేశ్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఉన్నారు. ఇప్పుడు నాని కూడా వాళ్లతో చేరిపోయాడు. నాని అందరూ మీడియం రేంజ్ హీరో అంటున్నారు గానీ ఓవర్సీస్ లో వసూళ్లు చూస్తుంటే స్టార్ హీరోలకు ఏ మాత్రం తగ్గట్లేదని అనిపిస్తుంది.

హిట్ 3 విషయానికొస్తే.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కంటే వయలెన్స్ ఎక్కువుందనే టాక్ వస్తోంది. నాని కూడా ఈ విషయం ముందే చెప్పాడు. కాబట్టి ఈ తరహా రక్తపాతం సినిమాలు నచ్చేవాళ్లు హిట్ 3కి వెళ్తున్నారు. దీని తర్వాత అంటే త్వరలో 'ద ప్యారడైజ్' సెట్స్ లో నాని అడుగుపెట్టబోతున్నాడు. అనంతరం డైరెక్టర్ సుజీత్ తో ఓ మూవీ చేస్తాడు.

(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు.. ఈ రెండు రోజుల్లోనే)  

Advertisement
 
Advertisement
Advertisement