'ఆదిపురుష్' రిజల్ట్ పై దర్శకుడి తెలివితక్కువ వాదన | Om Raut Reaction On Adipurush Result Waves Summit 2025 | Sakshi
Sakshi News home page

Om Raut Adipurush: ఫ్లాప్ అని ఒప్పుకోవట్లేదు.. పైగా కవరింగ్

May 3 2025 4:37 PM | Updated on May 3 2025 5:12 PM

Om Raut Reaction On Adipurush Result Waves Summit 2025

'కాకి పిల్ల కాకికి ముద్దు' అని తెలుగులో ఓ సామెత ఉంది. దీన్ని చాలామంది దర్శకులకు అన్వయించి చెప్పొచ్చు. ఎందుకంటే తాము తీసిన సినిమా పెద్ద కళాఖండం అనుకుంటారు. ప్రేక్షకులు అడ్డంగా తిరస్కరించినా ఫ్లాప్ అని ఒప్పుకోవడానికి మనసు రాదు. 'ఆదిపురుష్' దర్శకుడి మాటలు చూస్తుంటే అదే అనిపిస్తుంది.

(ఇదీ చదవండి: రెండో పెళ్లి చేసుకుంటా.. అందరికీ సమాధానమిస్తా: జాను లిరి 

తాజాగా ముంబైలో జరిగిన వేవ్ సమ్మిట్ లో పాల్గొన్న దర్శకుడు ఓం రౌత్.. 'ఆదిపురుష్' గురించి చిత్రవిచిత్రమైన కామెంట్స్ చేశారు. ఇది విని ప్రభాస్ ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అయిందనే చెప్పాలి. ఈ వ్యాఖ‍్యలపై ‍అదే స్థాయిలో ట్రోలింగ్ జరుగుతుండటం ఇక్కడ కొసమెరుపు.

వేవ్స్ సమ్మిట్ లో పాల్గొన్న ఓం రౌత్.. ఆదిపురుష్ తెలుగు హక్కుల్ని రూ.120 కోట్లకు కొన్నారని, అంటే ఎక్కువ మంది ప్రేక్షకులు చూసినట్లే కదా అని చెప్పుకొచ్చాడు. ఈ లాజిక్ దెబ్బకు అందరికీ నోట మాట రావట్లేదు. ఎందుకంటే రూ.120 కోట్లు పెట్టి కొనడం కాదు, అంతకు మించిన వసూళ్లు వస్తే అప్పుడు ఎక్కువ మంది ప్రేక్షకులు సినిమాను చూసినట్లు. ఈ లాజిక్ ఓం రౌత్ కి ఎప్పుడు అర్థమవుతుందోనని ఓ నెటిజన్ కామెంట్స్ చేశాడు.

(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు.. ఈ రెండు రోజుల్లోనే)  

ఓం రౌత్.. ఆదిపురుష్ గనుక సరిగా తీసి ఉంటే ఈ పాటికే మరో సినిమా లైన్ లో పెట్టేవాడు. దాని రిజల్ట్ తేడా కొట్టడం వల్లే రెండేళ్లయినా కొత్త ప్రాజెక్ట్ సెట్ చేసుకోలేకపోతున్నాడు. మరోవైపు ఇదే బాలీవుడ్ లో రణ్ బీర్ కపూర్, సాయిపల్లవిలతో రామాయణాన్ని సినిమాగా తీస్తున్నారు.

ఆదిపురుష్ చిత్రంలో రావణుడిగా చేసిన సైఫ్ అలీఖాన్ కూడా మొన్నీమధ్య సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేశారు. తన కొడుకుతో సినిమా చూసిన తర్వాత అతడికి సారీ కూడా చెప్పానని అన్నాడు. అంటే మూవీ ఫ్లాప్ అయిందని స్వయంగా సైఫ్ ఒప్పుకొన్నట్లే. కానీ ఓం రౌత్ మాత్రం 'ఆదిపురుష్' హిట్ అనే భ్రమల్లో ఇంకా బతికేస్తున్నాడేమో?

(ఇదీ చదవండి: కొత్త రికార్డ్.. మహేశ్ బాబు తర్వాత నానినే 

Advertisement
 
Advertisement
Advertisement