
సినిమాను విజువల్ వండర్‌లా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఎంత ఖర్చయినా వెనక్కు తగ్గడం లేదు నిర్మాతలు. మామూలు సినిమాకు కూడా రూ.100 కోట్ల బడ్జెట్ అనేది సాధారణమైపోయింది. ఆర్‌ఆర్‌ఆర్, కల్కి 2898ఏడీ, ఆదిపురుష్.. ఇవన్నీ అయితే రూ.500 కోట్లపైనే పెట్టి తీశారు. అయితే భారతీయ సినీచరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రామాయణ చిత్రం (Ramayana Movie) తెరకెక్కుతోంది. నితీశ్ తివారీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతాదేవిగా నటిస్తున్నారు.
బాల శూర్పణఖగా..
రాకింగ్ స్టార్ యశ్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా కనిపించనున్నారు. శూర్పణఖ పాత్ర కోసం ప్రియాంక చోప్రాను సంప్రదించగా ఆమె బిజీగా ఉండటంతో అవకాశాన్ని వదిలేసుకుందట. దీంతో ఈ రోల్ రకుల్‌కు వెళ్లిందని ప్రచారం జరిగింది. లేటెస్ట్ టాక్ ప్రకారం.. పదిహేనేళ్ల దిశిత సెగల్‌ను బాల శూర్పణఖగా వెండితెరపై చూపించాలని ప్రయత్నిస్తున్నారట! ఆడిషన్‌తో పాటు లుక్ టెస్ట్ కూడా అయిపోందని, తనపై కొన్ని సీన్లు కూడా చిత్రీకరించారని బీటౌన్‌లో ప్రచారం జరుగుతోంది. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది.
ఎవరీ దిశిత సెగల్?
నాలుగేళ్లే వయసులోనే వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది దిశిత. బేబీ సినిమాలో అక్షయ్ కుమార్ కూతురిగా, డియర్ జిందగీలో చిన్నారి ఆలియా భట్‌లా యాక్ట్ చేసింది. వార్, హిందీ మీడియం చిత్రాల్లోనూ నటించింది. ఇటీవలే బెహాన్ డర్‌గయినా అనే ఓటీటీ షోలోనూ మెరిసింది.
చదవండి: జీవితంలో తొలిసారి పిడకలు చేశా.. ఆ మరునాడే..: నిత్యామీనన్