breaking news
Ramayana movie
-
సీతగా 'సాయిపల్లవి'నే ఎందుకు.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్
భారత సినీ పరిశ్రమలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా 'రామాయణ'.. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం ఏకంగా రూ. 4 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీకి నితేశ్ తివారీ దర్శకుడు. ఇందులో రాముడిగా బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారు. రాకింగ్ స్టార్ యశ్ నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, అలాగే నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సంయుక్తంగా కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ మూవీ టీమ్ మాట్లాడుతూ సీతగా సాయిపల్లవిని ఎందుకు ఎంపిక చేశారో పేర్కొంది.సీతా దేవి పాత్ర కోసం చాలామందిని అనుకున్నాం. కానీ, సాయిపల్లవిని ఫైనల్ చేయడానికి తమకు చాలా కారణాలు ఉన్నాయిని రామాయణ చిత్ర యూనిట్ పేర్కొంది. ఆమె గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండటమే కాకుండా తన అందం కోసం ఆమె ఎలాంటి సర్జరీలు చేయించుకోలేదని తెలిపింది. సహజ అందమే తమ సినిమాకు బాగుంటుందని అనుకున్నామని, అలా ఒక సందేశం ఇచ్చినట్లు ఉంటుందని టీమ్ రామాయణ ప్రకటించింది. సాయి పల్లవి మంచి నటి కూడా.. ఎలాంటి పాత్రనైనా సులువుగా చేయగలదు. సీత పాత్ర తనకు ఎంతో పేరు తప్పకుండా తెస్తుందని వారు తెలిపారు. రాముడిగా రణ్‌బీర్‌ను తీసుకోవడానికి కారణం ఆయన మొఖంలో చాలా ప్రశాంతత కనిపిస్తుందని చెప్పారు. తనలోని వ్యక్తిత్వమే కాకుండా గొప్పగా నటించే నైపుణ్యం తనలో ఉందని మేకర్స్ చెప్పారు. ఈ మూవీ మొదటి పార్ట్ 2026 దీపావళికి, రెండోది 2027 దీపావళికి విడుదల కానున్న విషయం తెలిసిందే. హాలీవుడ్ హిట్ సినిమా'లార్డ్ ఆఫ్ ది రింగ్స్'కు పనిచేసిన స్టంట్ డైరెక్టర్ టెర్రీ ‘రామాయణ’ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారని మేకర్స్ ప్రకటించారు. వానరసేన, హనుమాన్‌లతో కనిపించే సన్నివేశాలకు సంబంధించి ఆయన క్రియేట్ చేసిన ప్రపంచానికి అందరూ ఫిదా అవుతారని తెలిపారు. 'ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్'లో ఏ విధంగానైతే వీఎఫ్ఎక్స్ పనితీరు ఉంటుందో అదే విధంగా రామాయణ చిత్రంలోని వానరసేన అంతే సహజంగా ఉంటుందని టీమ్ తెలిపింది. -
శూర్పణఖగా 10th క్లాస్ అమ్మాయి.. ఆమె ఎవరంటే?
సినిమాను విజువల్ వండర్లా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఎంత ఖర్చయినా వెనక్కు తగ్గడం లేదు నిర్మాతలు. మామూలు సినిమాకు కూడా రూ.100 కోట్ల బడ్జెట్ అనేది సాధారణమైపోయింది. ఆర్ఆర్ఆర్, కల్కి 2898ఏడీ, ఆదిపురుష్.. ఇవన్నీ అయితే రూ.500 కోట్లపైనే పెట్టి తీశారు. అయితే భారతీయ సినీచరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రామాయణ చిత్రం (Ramayana Movie) తెరకెక్కుతోంది. నితీశ్ తివారీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతాదేవిగా నటిస్తున్నారు. బాల శూర్పణఖగా..రాకింగ్ స్టార్ యశ్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా కనిపించనున్నారు. శూర్పణఖ పాత్ర కోసం ప్రియాంక చోప్రాను సంప్రదించగా ఆమె బిజీగా ఉండటంతో అవకాశాన్ని వదిలేసుకుందట. దీంతో ఈ రోల్ రకుల్‌కు వెళ్లిందని ప్రచారం జరిగింది. లేటెస్ట్ టాక్ ప్రకారం.. పదిహేనేళ్ల దిశిత సెగల్‌ను బాల శూర్పణఖగా వెండితెరపై చూపించాలని ప్రయత్నిస్తున్నారట! ఆడిషన్‌తో పాటు లుక్ టెస్ట్ కూడా అయిపోందని, తనపై కొన్ని సీన్లు కూడా చిత్రీకరించారని బీటౌన్‌లో ప్రచారం జరుగుతోంది. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది.ఎవరీ దిశిత సెగల్?నాలుగేళ్లే వయసులోనే వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది దిశిత. బేబీ సినిమాలో అక్షయ్ కుమార్ కూతురిగా, డియర్ జిందగీలో చిన్నారి ఆలియా భట్లా యాక్ట్ చేసింది. వార్, హిందీ మీడియం చిత్రాల్లోనూ నటించింది. ఇటీవలే బెహాన్ డర్గయినా అనే ఓటీటీ షోలోనూ మెరిసింది. View this post on Instagram A post shared by Dishita Sehgal🧿 (@cutiepiedishita) చదవండి: జీవితంలో తొలిసారి పిడకలు చేశా.. ఆ మరునాడే..: నిత్యామీనన్ -
'రామాయణ' బడ్జెట్ రివీల్ చేసిన నిర్మాత.. మీ ఊహకు కూడా అందదు
రామాయణం మానవ జీవితానికి అవసరమైన విలువలను, మార్గదర్శకత్వాన్ని అందించే ఒక గొప్ప గ్రంథం. మన రాముడి గురించి 'రామాయణ' సినిమా ద్వారా ప్రపంచానికి బాలీవుడ్ చూపనుంది. తాజాగా విడుదలైన గ్లింప్స్ విజువల్స్ అద్బుతంగా ఉన్నాయంటూ గ్రాఫిక్స్ వర్క్‌పై ప్రశంసలు అందుతున్నాయి. దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రాముడి పాత్రలో బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారు. రాకింగ్ స్టార్ యశ్ నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, అలాగే నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సంయుక్తంగా కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నాయి. రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రాల బడ్జెట్ గురించి నమిత్ మల్హోత్రా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.రూ. 4 వేల కోట్ల బడ్జెట్ఇటీవల జరిగిన పాడ్‌కాస్ట్‌లో, నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ.. రామాయణంలోని రెండు భాగాలకు దాదాపు $500 మిలియన్లు, అంటే దాదాపు రూ. 4000 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. దీంతో రామాయణం అత్యంత ఖరీదైన భారతీయ చిత్రంగా నిలిచింది. ఇప్పటివరకు విడుదలైన భారతీయ చిత్రాల బడ్జెట్లు ఏవీ 1000 కోట్లు దాటలేదు. ఈ బడ్జెట్‌తో రామాయణం ప్రపంచ సినిమాల్లో అత్యంత ఖరీదైన ఫ్రాంచైజీలలో ఒకటిగా కూడా మారనుంది. ఇప్పటివరకు ఈ చిత్రాల బడ్జెట్ రూ. 1500 కోట్ల వరకు ఉంటుందని మీడియాలో కథనాలు వచ్చాయి. ఇప్పుడు నిర్మాత చెప్పిన లెక్కలు చూస్తుంటే కళ్లు చెదిరేలా ఈ మూవీ ఉండబోతుందని అర్థం అవుతుంది."పార్ట్ 1, పార్ట్ 2 రెండు సినిమాలు కలిపి పూర్తయ్యే సమయానికి ఇది దాదాపు $500 మిలియన్లు అవుతుంది, అంటే దాదాపు రూ. 4000 కోట్లు. ప్రపంచం చూడవలసిన గొప్ప కథ రామాయణం. మేము ప్రపంచంలోనే అతిపెద్ద చిత్రాన్ని నిర్మిస్తున్నాము. అయితే, ఇది ఇప్పటికీ కొన్ని హాలీవుడ్ చిత్రాల బడ్జెట్ల కంటే తక్కువేనని నేను భావిస్తున్నాను. తక్కువ ఖర్చుతో పెద్ద చిత్రాన్ని నిర్మిస్తున్నామని నేను భావిస్తున్నాను. ఈ చిత్రం కేవలం డబ్బు కోసమే చేస్తుంది కాదు. ప్రపంచానికి మన రాముడి గురించి చెప్పాలని అనుకున్నాను.' అని నమిత్ అన్నారు. 20కి పైగా భాషలుహాలీవుడ్లోని ఇతర సినిమాల మాదిరిగానే రామాయణం కూడా ప్రపంచవ్యాప్తంగా సుమారు 20కి పైగా భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని DC కామిక్స్ హిట్ చిత్రాలు బ్యాట్మన్, సూపర్ మెన్, వండర్ వుమన్ వంటి వాటితో పాటు మార్వెల్ సినిమాలకు తగ్గకుండా రామాయణ ప్రాజెక్ట్ రూపొందించాలని మేకర్స్ యోచిస్తున్నారు. మొదటి భాగం 2026 దీపావళి సందర్భంగా విడుదల కానుంది. రెండవ భాగం 2027 దీపావళి సందర్భంగా తెరపైకి రానుంది. -
'రామాయణ' కోసం వారిద్దరికి భారీ రెమ్యునరేషన్
బాలీవుడ్లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ‘రామాయణ’ (Ramayana). దంగల్ మూవీ దర్శకుడు నితీశ్ తివారీ (Nitesh Tiwari) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రాముడిగా బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ నటిస్తుండగా.. సీతగా సాయిపల్లవి కనిపించనున్నారు. అయితే, వారిద్దరి రెమ్యునరేషన్ గురించి పలు వార్తలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రం.. 2026 దీపావళికి మొదటి భాగం, 2027 దీపావళికి రెండో భాగం విడుదల కానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.రామాయణ చిత్రం రెండు భాగాలు కలిపి సుమారు రూ. 1600 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కనుందని సమాచారం. విజువల్ వండర్‌గా రానున్న ఈ మూవీని రాకింగ్ స్టార్ యశ్ నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, అలాగే నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సంయుక్తంగా కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నాయి. దేశంలోనే అత్యంత ఖరీదైన సినిమాగా 'రామాయణ' చరిత్ర సృష్టించింది. అయితే, ఈ సినిమాలో రాముడిగా నటిస్తున్న రణ్‌బీర్ కపూర్ రూ. 150 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. రెండు భాగాలకు కలిపి ఈ మెత్తం తీసుకుంటున్నారని టాక్. సీతగా నటిస్తున్న సాయిపల్లవి రూ. 15 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీలో ఒక వార్త వైరల్ అవుతుంది.రామాయణ సినిమాలో లంకాధిపతి రావణుడి పాత్రలో 'కేజీఎఫ్' ఫేమ్ యశ్ కనిపించనున్నారు. రవి దూబే (లక్ష్మణుడు), సన్నీ డియోల్ (ఆంజనేయుడు)గా కనిపించనున్నారు. వీరితో పాటు వివేక్ ఒబెరాయ్, రకుల్ ప్రీత్ సింగ్, లారా దత్తా, కాజల్ అగర్వాల్, అరుణ్ గోవిల్, షీబా చద్దా వంటి సూపర్‌స్టార్స్ ఈ మూవీ కోసం పనిచేస్తున్నారు. దంగల్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నితేశ్ తివారీ ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తుండటంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. -
భారత్‌లో అత్యంత ఖరీదైన చిత్రం ఇదే.. ఆ తర్వాతే ప్రభాస్ 'కల్కి'
బాలీవుడ్లో తెరకెక్కుతున్న 'రామాయణ' సినిమా గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. తాజాగా విడుదలైన గ్లింప్స్ విజువల్స్ అద్బుతంగా ఉన్నాయంటూ గ్రాఫిక్స్ వర్క్‌పై ప్రశంసలు అందుతున్నాయి. ఈ మూవీ భారతదేశంలోనే అత్యంత ఖరీదైనదిగా రికార్డ్ నెలకొల్పనుంది. మానవ సమాజ గతినే ప్రభావితం చేసిన ఒక మహత్తర కావ్యం రామాయణం. ఈ కావ్యాన్ని ఆధారం చేసుకుని ఇప్పటికే పలు సినిమాలు వచ్చాయి. కానీ, గ్రాఫిక్స్ వర్క్ ప్రధాన బలంగా ఒక అద్భుతాన్ని దర్శకుడు నితేశ్ తివారీ వెండితెరపై చూపించనున్నాడు. రామాయణం మధురమైన కథ. ఎన్నిసార్లు రామాయణం చదివినా, విన్నా కొత్తగా అనిపిస్తుంది. అందుకే ఇప్పటికే పలుమార్లు సినిమాగా వెండితెరపై మెరిసింది. ఇప్పుడు మరోసారి బాలీవుడ్లో 'రామాయణ' పేరుతో అత్యంత భారీ బడ్జెట్ పేరుతో సినిమా వస్తుంది.భారతీయ సినీ చరిత్రలో అత్యంత బడ్జెట్ చిత్రంగా 'రామయణ'అన్ని యుద్ధాల్ని అంతం చేసే యుద్ధం మొదలైందని తాజాగా విడుదలైన రామయణ గ్లింప్స్‌లో మేకర్స్ పేర్కొన్నారు. అదేవిధంగా ఈ చిత్రంతో బాక్సాఫీస్ రికార్డ్‌లు అన్నీ అంతం కావడమే కాకుండా కొత్త రికార్డ్ మొదలైంది. రామయణ పార్ట్-1 కోసం ఏకంగా రూ. 835 కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో దేశంలోనే అత్యంత ఖరీదైన సినిమాగా 'రామాయణ' చరిత్ర సృష్టించింది. రాకింగ్ స్టార్ యశ్ నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, అలాగే నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సంయుక్తంగా కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నాయి. ఇప్పటివరకు అత్యధిక బడ్జెట్ చిత్రాలుగా నిలిచిన కల్కి 2898 ఏడీ (రూ. 600 కోట్లు), ఆర్ఆర్ఆర్ (రూ. 550 కోట్లు), ఆదిపురుష్ (రూ. 550 కోట్లు) వంటి చిత్రాలను రామాయణ అధిగమించింది.భారీ తారాగణంరామాయణ సినిమాలో రాముడి పాత్రలో బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారు. లంకాధిపతి రావణుడి పాత్రలో 'కేజీఎఫ్' ఫేమ్ యశ్ కనిపించనున్నారు. రవి దూబే (లక్ష్మణుడు), సన్నీ డియోల్ (ఆంజనేయుడు)గా కనిపించనున్నారు. వీరితో పాటు వివేక్ ఒబెరాయ్, రకుల్ ప్రీత్ సింగ్, లారా దత్తా, కాజల్ అగర్వాల్, అరుణ్ గోవిల్, షీబా చద్దా వంటి సూపర్‌స్టార్స్ ఈ మూవీ కోసం పనిచేస్తున్నారు. దంగల్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నితేశ్ తివారీ దర్శకత్వంలో ఈ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతుంది.ఎనిమిది ఆస్కార్ అవార్డ్స్ అందుకున్న సంస్ధతో మ్యాజిక్ఈ మూవీ కోసం ఉత్కంఠభరితమైన విజువల్ ఎఫెక్ట్‌లను మేకర్స్ అందించనున్నారు. అందు కోసం కోట్ల రూపాయలే ఖర్చుచేస్తున్నారు. ప్రపంచంలోనే గుర్తింపు పొందిన బ్రిటిష్-ఇండియన్ VFX కంపెనీ ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తుంది. ఈ సంస్థ ఇప్పటికే ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్‌కు గాను ఎనిమిది ఆస్కార్ అవార్డ్‌లను గెలుచుకుంది. ఆపై ఈ మూవీకి హాలీవుడ్ సంగీత దర్శకుడు హన్స్ జిమ్మెర్ పనిచేస్తున్నారు. ఆయన గ్లాడియేటర్, ఇంటర్ స్టెల్లర్, ది లయన్ కింగ్, డ్యూన్ వంటి టాప్ చిత్రాలకు సంగీతం అందించారు. ఆర్ రెహమాన్ కూడా రామయణ చిత్రానికి సంగీతంలో భాగం పంచుకోవడం విశేషం.