
బాలీవుడ్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ‘రామాయణ’ (Ramayana). దంగల్ మూవీ దర్శకుడు నితీశ్ తివారీ (Nitesh Tiwari) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రాముడిగా బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ నటిస్తుండగా.. సీతగా సాయిపల్లవి కనిపించనున్నారు. అయితే, వారిద్దరి రెమ్యునరేషన్ గురించి పలు వార్తలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రం.. 2026 దీపావళికి మొదటి భాగం, 2027 దీపావళికి రెండో భాగం విడుదల కానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
రామాయణ చిత్రం రెండు భాగాలు కలిపి సుమారు రూ. 1600 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కనుందని సమాచారం. విజువల్ వండర్‌గా రానున్న ఈ మూవీని రాకింగ్ స్టార్ యశ్ నిర్మాణ సంస్థ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్, అలాగే నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సంయుక్తంగా కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నాయి. దేశంలోనే అత్యంత ఖరీదైన సినిమాగా 'రామాయణ' చరిత్ర సృష్టించింది. అయితే, ఈ సినిమాలో రాముడిగా నటిస్తున్న రణ్‌బీర్ కపూర్ రూ. 150 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. రెండు భాగాలకు కలిపి ఈ మెత్తం తీసుకుంటున్నారని టాక్. సీతగా నటిస్తున్న సాయిపల్లవి రూ. 15 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీలో ఒక వార్త వైరల్ అవుతుంది.
రామాయణ సినిమాలో లంకాధిపతి రావణుడి పాత్రలో 'కేజీఎఫ్' ఫేమ్ యశ్ కనిపించనున్నారు. రవి దూబే (లక్ష్మణుడు), సన్నీ డియోల్ (ఆంజనేయుడు)గా కనిపించనున్నారు. వీరితో పాటు వివేక్ ఒబెరాయ్, రకుల్ ప్రీత్ సింగ్, లారా దత్తా, కాజల్ అగర్వాల్, అరుణ్ గోవిల్, షీబా చద్దా వంటి సూపర్‌స్టార్స్ ఈ మూవీ కోసం పనిచేస్తున్నారు. దంగల్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నితేశ్ తివారీ ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తుండటంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.