
పంచాయత్ వెబ్ సిరీస్తో ఫేమ్ తెచ్చుకున్న నటుడు ఆసిఫ్ ఖాన్ ఆస్పత్రిలో చేరారు. గుండె పోటు రావడంతో ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. జీవితం చాలా చిన్నది అంటూ ఆస్పత్రి పైకప్పు ఫోటోను షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు త్వరగా కోలుకోవాలంటూ పోస్టులు పెడుతున్నారు.
‘మీర్జాపూర్ వెబ్‌సిరీస్‌తో ఓటీటీకి ఎంట్రీ ఇచ్చిన ఆసిఫ్ ఖాన్ మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత పంచాయత్, పాతాళ్ లోక్ వంటి వెబ్ సిరీస్‌ల్లోనూ కీలక పాత్రలు పోషించారు. అంతేకాకుండా రెడీ, టాయిలెట్, అగ్నిపథ్, పాగ్లైట్, కాకుడా హిందీ సినిమాల్లో నటించారు. అయితే ఆసిఫ్ ఖాన్ రెండు రోజుల క్రితం అయితే గుండెపోటుతో ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. ప్రస్తుతం బాగానే ఉన్నారని.. రెండు రోజుల్లో డిశ్చార్జ్ అవుతాడని తెలుస్తోంది.
ఆసిఫ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఆస్పత్రి పైకప్పు ఫోటోను షేర్ చేస్తూ.. "గత 36 గంటలుగా దీన్ని చూసిన తర్వాత జీవితం చిన్నది. ఏ రోజును తేలికగా తీసుకోకండి, ప్రతిదీ ఒక్క క్షణంలో మారవచ్చు., మీ దగ్గర ఉన్నదాని పట్ల కృతజ్ఞతతో ఉండండి. మీకు ఎవరు ఎక్కువ ముఖ్యమైనవారో గుర్తుంచుకోండి. ఎల్లప్పుడూ వారిని గౌరవించండి. జీవితం ఒక బహుమతి' అని రాసుకొచ్చారు. కాగా.. పంచాయత్' వెబ్ సిరీస్లో ఆసిఫ్ ఖాన్.. గణేష్ పాత్రను పోషించాడు.