సీనియర్ నటుడు మృతి.. రాధిక పోస్ట్ వైరల్ | Actor Ravi Kumar Passes Away | Sakshi
Sakshi News home page

Ravi Kumar: ప్రముఖ మలయాళ నటుడు కన్నుమూత

Apr 4 2025 3:15 PM | Updated on Apr 4 2025 4:21 PM

Actor Ravi Kumar Passes Away

తమిళ, మలయాళ సినిమాల్లో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రవి కుమార్ (71) చనిపోయారు. గతకొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన.. చెన్నై వళచెరిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని రవికుమార్ కొడుకు ధ్రువీకరించాడు. నటి రాధిక కూడా రవికుమార్ మృతిపై పోస్ట్ పెట్టింది.

 (ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 18 మూవీస్)

కేరళ త్రిసూర్ కి చెందిన రవికుమార్.. 1975 నుంచి సినిమాలు చేస్తున్నారు. ఉల్లాస యాత్ర, అవరగళ్, సీబీఐ 5, పరమానందం తదితర మలయాళ చిత్రాలు చేశారు. తమిళంలోనూ అల్లాఉద్దీన్ అద్భుత విళక్కుమ్, రమణ, ఆనంద రాగం తదితర సినిమాలు చేశారు. చివరగా 2022లో వీట్ల విశేషమ్ మూవీలో నటించారు.

(ఇదీ చదవండి: దర్శకుడు బుచ్చిబాబుకు గిఫ్ట్‌ పంపిన రామ్‌ చరణ్‌)

Advertisement
 
Advertisement
Advertisement