దర్శకుడు బుచ్చిబాబుకు గిఫ్ట్‌ పంపిన 'రామ్‌ చరణ్‌- ఉపాసన' | Ram Charan And Upasana Gift Sent To Director Buchibabu | Sakshi
Sakshi News home page

దర్శకుడు బుచ్చిబాబుకు గిఫ్ట్‌ పంపిన 'రామ్‌ చరణ్‌- ఉపాసన'

Apr 4 2025 12:41 PM | Updated on Apr 4 2025 3:12 PM

Ram Charan And Upasana Gift Sent To Director Buchibabu

మార్చి 27న రామ్‌చరణ్‌ 40వ పుట్టినరోజు జరుపుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆ సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబుకు చరణ్‌ దంపతులు ఒక గిఫ్ట్‌ పంపారు. ఇదే విషయాన్ని తెలుపుతూ తాజాగా ఆయన ఒక పోస్ట్‌ షేర్ చేశారు. చరణ్‌ పంపిన ఆ కానుక చాలా ప్రత్యేకమైనదని అందులో బుచ్చిబాబు పేర్కొన్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో పెద్ది సినిమా తెరకెక్కుతుండటం వల్ల వారిద్దరి మధ్య మంచి బాండింగ్‌ పెరిగిన విషయం తెలిసిందే.

చరణ్‌- ఉపాసన గిఫ్ట్‌గా దర్శకుడు బుచ్చిబాబుకు హనుమాన్‌ చాలీసా పుస్తకాన్ని పంపారు. అందులోనే హనుమంతుడి ప్రతిమ, శ్రీరాముని పాదుకలను కూడా ఆయనకు పంపారు. ఆపై బుచ్చిబాబు గురించి చరణ్‌ ఒక నోట్‌ ఇలా రాశారు.'కష్టకాలంలో హనుమాన్‌ నా వెంటే ఉన్నాడు. జీవితంలో నన్ను ఆయనే గైడ్‌ చేశాడు. ఇప్పుడు నేను 40వ దశకంలో అడుగుపెడుతున్నాను. ఇన్నేళ్లు నాకు శక్తిని ఇచ్చిన హనుమాను ఆశీస్సులు నీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.  నా మనసులో నీవు (బుచ్చిబాబు) ఎప్పటికీ ప్రత్యేకంగా ఉంటావు.' అని చరణ్‌ పేర్కొన్నారు. ఈ క్రమంలో బుచ్చిబాబు కూడా చరణ్ దంపతులకు కృతజ్ఞతలు చెప్పాడు. హనుమంతుని ఆశీస్సులు మీకు మరింత బలాన్ని, శక్తిని ప్రసాదించుగాక అని బుచ్చిబాబు ట్వీట్‌ చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలను బుచ్చిబాబు షేర్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement