
చెన్నై: తమిళనాడు దివంగత సీఎం కరుణానిధి పెద్ద కుమారుడు, సీఎం స్టాలిన్ సోదరుడు ఎంకే ముత్తు(77) శనివారం కన్నుమూశారు. నటుడు, నేపథ్య గాయకుడు అయిన ముత్తు వయో సంబంధ సమస్యలతో చనిపోయారని కుటుంబసభ్యులు తెలిపారు. సీఎం స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిధి విషయం తెల్సిన వెంటనే ముత్తు నివాసానికి వెళ్లి నివాళులర్పించారు.
మాజీ గవర్నర్ తమిళిసై సహా పలువురు నేతలు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. శనివారం సాయంత్రం బీసెంట్ నగర్‌లోని విద్యుత్ శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. అంత్యక్రియలకు స్టాలిన్ సోదరి, ఎంపీ కనిమొళి, సోదరులు అళగిరి తదితరులు హాజరయ్యారు. కరుణానిధికి ముగ్గురు భార్యలు కాగా, మొదట భార్య పద్మావతికి పుట్టిన కుమారుడే ముత్తు.