
కూతురు తేజస్విని పండిట్‌తో చందేకర్(ఫైల్ ఫోటో)
మారాఠీ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటి జ్యోతి చందేకర్ (69) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆగస్టు 16న సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. మరాఠీ సిరీయళ్లతో పాటు పలు చిత్రాల్లోనూ జ్యోతి నటించారు. 12 ఏళ్ల వయసులోనే కెరీర్‌ని ప్రారంభించి, తనదైన నటనతో ఇండస్ట్రీలో కి వచ్చిన అతి కొద్ది కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది.

‘ఛత్రీవాలీ’, ‘తూ సౌభాగ్యవతి హో’ సీరియళ్లు జ్యోతి కెరీర్‌ని మలుపు తిప్పాయి. బుల్లితెరపై వచ్చిన ఫేమ్‌తో సినిమా చాన్స్‌లు వచ్చాయి. ధోల్కీ, ‘తిచా ఉంబర్తా’. ‘మీ సింధుతాయ్ సప్కాల్’ వంటి చిత్రాలు జ్యోతికి నటిగా మంచి గుర్తింపుని సంపాదించిపెట్టాయి.
మారాఠి ఇండస్ట్రీ నుంచి ఎన్నో అవార్డులను అందుకుంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు పుణెలోని తమ నివాసం జ్యోతి చందేకర్ అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్లు ఆమె కూతురు, నటి తేజస్విని పండిట్ తెలిపారు.