సాక్షి, గుంటూరు: బీఆర్‌ఎస్ సీనియర్ నేత, తెలంగాణ మాజీ మంత్రి హరీష్‌రావును వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పరామర్శించారు. హరీష్‌రావు తండ్రి సత్యనారాయణరావు ఈ వేకువజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంతో వైఎస్ జగన్ ఆయనతో ఫోన్‌లో మాట్లాడి సానుభూతి తెలియజేశారు. అంతకు ముందు..
హరీష్‌రావు పితృవియోగంపై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు సంతాపం తెలియజేస్తూ తన ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. ‘‘తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీష్ రావు గారి తండ్రి సత్యనారాయణ రావుగారి మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. సత్యనారాయణ రావుగారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీష్ రావు గారి తండ్రి సత్యనారాయణ రావుగారి మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. సత్యనారాయణ రావుగారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.…
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 28, 2025
హరీష్‌రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ ఈ వేకువజామున కన్నుమూశారు. దీంతో హైదరాబాద్‌లోని క్రిన్స్‌విల్లాస్‌లో సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని ఉంచారు. కేటీఆర్ సహా పలువురు బీఆర్‌ఎస్ నేతలు, ఇతర రాజకీయ ప్రముఖులు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.


