
న్యూఢిల్లీ: బీజేపీ కురువృద్ధ నేత విజయ్ కుమార్ మల్హోత్రా(93) కన్నుమూశారు. వయో సంబంధ రుగ్మతలతో గత కొద్ది రోజులుగా ఎయిమ్స్‌లో ఆయన చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించి మంగళవారం ఉదయం ఆయన కన్నుమూశారు. మల్హోత్రా మృతదేహాన్ని ఆయన అధికార నివాసానికి తరలించారు. ప్రధాని మోదీ వెళ్లి నివాళులరి్పంచారు. మల్హోత్రా మృతి పట్ల రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ సంతాపం వ్యక్తం చేశారు.
ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఢిల్లీ బీజేపీకి మొట్టమొదటి అధ్యక్షుడిగా పనిచేసిన మల్హోత్రా, ఢిల్లీ నుంచి ఐదు పర్యాయాలు ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999 లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యరి్థగా ఉన్న మన్మోహన్ సింగ్‌ను ఓడించారు. 2004లో మన్మోహన్ ప్రధాని కావడం తెల్సిందే.