
తెలుగులో ఎన్నో సినిమాల్లో బాలనటుడిగా చేసి గుర్తింపు తెచ్చుకున్న మాస్టర్ భరత్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఇతడి తల్లి కమలహాసిని.. ఆదివారం రాత్రి చెన్నైలో మరణించారు. ఈ క్రమంలో తోటి నటీనటులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. చెన్నైలోని భరత్ ఇంటికి బంధుమిత్రులు, సినీ ప్రముఖులు వచ్చి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్)
దర్శకుడు శ్రీనువైట్ల తీసిన వెంకీ, రెడీ, ఢీ, కింగ్ సినిమాలతో పాటు బిందాస్, మిస్టర్ ఫెర్ఫెక్ట్ తదితర 80 తెలుగు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. పెద్దవాడు అయిన తర్వాత అల్లు శిరీష్ 'ఏబీసీడీ' మూవీతో నటుడిగా మారాడు. చివరగా గతేడాది రిలీజైన గోపీచంద్ విశ్వం సినిమాలో సహాయ పాత్రలో కనిపించాడు. ప్రస్తుతం ఒకటి రెండు సినిమాలు చేస్తున్నాడు.
నటుడిగా తెలుగు, తమిళ, కన్నడలో పలు చిత్రాలు చేసిన మాస్టర్ భరత్.. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతోనూ బాధపడుతున్నాడు. ఇలాంటి సమయంలో తల్లిని కోల్పోవడంతో చాలా బాధపడుతున్నాడు. ఆమె మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. ఈ విషాద ఘటనతో మాస్టర్ భరత్ అభిమానులు కూడా శోకసంద్రంలో మునిగారు.
(ఇదీ చదవండి: అందుకే నా కొడుకుకు ఆయన పేరు పెట్టుకున్నా: అనసూయ)

