టాలీవుడ్ హీరో ‘అల్లరి’ నరేశ్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తాతయ్య, దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తండ్రి ఈదర వెంకట్రావు(90) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో పాటు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన మంగళవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఆయన సతీమణి వెంకటరత్నం 2019లో మరణించారు.

వెంకట్రావుకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ 2011లో మృతి చెందారు. ప్రముఖ నటులు అల్లరి నరేశ్, ఆర్యన్ రాజేశ్ ఆయన కుమారులే. వెంకట్రావు మరణంలో అల్లరి నరేశ్ ఇంట విషాద ఛాయలు అలముకున్నాయి. నిడదవోలు మండలం కోరుమామిడిలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు జరుగనున్నాయి.


