
చెట్టంత ఎదిగిన పిల్లలకు వేడుకగా పెళ్లి చేయాలని భావిస్తారు ఏ తల్లిదండ్రులైనా. అలాగే కనిపెంచిన అమ్మానాన్నల కనుల విందుగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాలి ఆశిస్తారు ఏ బిడ్డలైనా. కానీ కన్నకొడుకు మూడు ముళ్ల ముచ్చట చూడాలన్న కోరిక తీరకముందే ఓ తండ్రి అనంతలోకాలకు వెళ్లిపోయాడు. దీంతో పుట్టెడు దుఃఖ్ఖంతో కొడుకు తీసుకున్న నిర్ణయం పలువురి చేత కంట తడి పెట్టిస్తోంది.
Cuddalore Marriage | அப்பாவின் உடல் முன்பு நடைபெற்ற மகன் திருமணம்#cuddalore #viralvideo #virudhachalam #marriage #death pic.twitter.com/wUJW3qgvov
— Thanthi TV (@ThanthiTV) April 18, 2025
తండ్రి నిండు మనసుతో అక్షింతలేసి ఆశీర్వదిస్తుండగా, తన ప్రియురాల్ని పెళ్లి చేసుకోవాలని భావించిన కొడుక్కి తీరని వేదని మిగిల్చిన ఘటన ఇది. దీంతో తండ్రి భౌతిక దేహం సాక్షిగా అమ్మాయి మెడలో తాళి కట్టాడు. వధూవురులతోపాటు, బంధుమిత్రుల అశ్రు నయనాల మధ్య జరిగిన ఈ పెళ్లి తమిళనాడులోని కడలూర్ జిల్లాలో చోటుచేసుకుంది. భౌతికంగా తన తండ్రి పూర్తిగా మాయం కాకముందే, ఆయన ఆశీస్సులు పొందాలనే ఉద్దేశంతో ప్రియురాలిని ఒప్పించి మరీ తండ్రి మృతదేహం ఎదుటే ఆమెకు తాళి కట్టారు. బోరున విలపిస్తూ తండ్రి ఆశీస్సులు తీసుకోవడం అక్కడున్నవారినందరి హృదయాలను బద్దలు చేసింది. ఉబికి వస్తున్న కన్నీటిని అదుముకుంటూ బంధువులు, స్థానికులు కూడా వారిని ఆశీర్వదించారు.
ఇదీ చదవండి:అనేక విషాద గాథల మధ్య.. స్ఫూర్తినిచ్చే జ్యోతి, శోభనాద్రి దాంపత్యం!
కవణై గ్రామానికి చెందిన సెల్వరాజ్(63) రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. ఆయన రెండో కుమారుడు అప్పు లా కోర్సు చదువుతున్నాడు. గత నాలుగేళ్లుగా విజయశాంతి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. తమ ప్రేమ సంగతిని ఇంట్లోని పెద్దలతో చెప్పారు. ఇరు కుటుంబాల అనుమతితో త్వరలోనే పెళ్లి చేసుకోవాలను కున్నారు. విరుధాచలం కౌంజియప్పర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విజయశాంతి డిగ్రీ చదువుతోంది. చదువు పూర్తైన తరువాత వివాహంచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలేదని ఆగవు కొన్ని..అన్నట్టు విధి మరోలా ఉంది. అప్పు తండ్రి సెల్వరాజ్ అనారోగ్యంతో అనూహ్యంగా కాలం చేశాడు. దీంతో గుండె పగిలిన అప్పు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.