
ప్రముఖ తమిళ నటుడు-హాస్యనటుడు రోబో శంకర్ ఆకస్మిక మరణం సినీ అభిమానులను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. తన కామెడీ టైమింగ్, సిగ్నేచర్ 'రోబో-స్టైల్' డ్యాన్స్‌తో పాపులర్ అయ్యాడు. సినిమా సెట్‌లో స్పృహ కోల్పోవడంతో చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. అయితే కేవలం 46 ఏళ్ల వయసులోనే ఆయన ఆకస్మిక మరణానికి గల కారణాలపై నెట్టింట తీవ్ర చర్చ నడుస్తోంది.
రోబో శంకర్ మరణంపై వైద్యులు అందించిన వివరాల ప్రకారం, రోబోకు సంక్లిష్టమైన ఉదర వ్యాధి, తీవ్రమైన గాస్ట్రో ఇంటెస్టినల్ రక్తస్రావం కారణంగా ఆయన పరిస్థితి మరింత క్షీణించింది. వైద్య బృందం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ చాలా అవయవాలు సరిగ్గా పనిచేయకపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు.
చదవండి: పెళ్లి చేసుకోవాలని అమెరికానుంచి వస్తే.. ఊపిరే తీసేశారు!
ఆకస్మికంగా బరువు తగ్గిన రోబో శంకర్
అయితే అనేక నివేదికల ప్రకారం రోబోశంకర్ ఇటీవల కామెర్ల వ్యాధితో బాధపడ్డాడు. దీనికి అతను దీర్ఘకాలిక చికిత్స పొందాడు. చికిత్స తర్వాత గణనీయంగా బరువు తగ్గినట్లు గుర్తించారు.ఇది అతని స్నేహితులు కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేసింది. నెమ్మదిగా కోలుకున్నప్పటికీ, పూర్తిగా కుదుటపడకముందే అప్పటికే ఒప్పుకున్న బుల్లి తెర కమిట్‌మెంట్లను నెరవేర్చడానికి యాక్టింగ్ షురూ చేశాడు. ఇంతలోనే ఆయన ఆరోగ్యం క్షీణించి కన్నుమూయడం అటు శంకర్ కుటుంబ సభ్యులను, ఇటు సినీ పరిశ్రమ వర్గాలను విషాదంలో ముంచింది. ఎక్కువగా మద్యం తాగే అలవాటు, కామెర్ల వ్యాధి, దీంతోపాటు ఉన్నట్టుండి గణనీయంగా బరువు తగ్గడం లాంటివి అతని ప్రాణాలకు చేటు తెచ్చాయని భావిస్తున్నారు.

చివరి రోజుల్లో రోబో శంకర్ భార్య ప్రియా శంకర్ రోబో శంకర్ భార్య ప్రియాంక శంకర్ అతని పక్కనే ఉన్నారు. రోబోశంకర్ కుమార్తె ఇంద్రజ శంకర్ కూడా నటి. అలాగే రోబో శంకర్ భార్యగానే కాకుండా, నటి మరియు ప్లస్-సైజ్ మోడల్ గా ప్రియా శంకర్ గుర్తింపు పొందారు. ప్రియాంక 2020 లో కన్ని మాడంతో తన నటనా రంగ ప్రవేశం చేసింది , కుక్ విత్ కోమలి సీజన్ 1 ,కలక్క పోవతు యారు సీజన్ 8 వంటి ప్రముఖ రియాలిటీ షోలలో పాల్గొన్నారు.
"Miss You ROBO".. மிக பெரிய இழப்பு.. கலாய்த்தால் கூட கட்டிப்பிடித்து முத்தம் கொடுப்பார்.. அஞ்சலி செலுத்திய பின் நினைவுகளை பகிர்ந்த நடிகர் ராமர் , புகழ்#RoboShankar #RIPRoboShankar #TamilCinema #ActorMourning #RestInPeace #DeepCondolences #TamilNews #Newstamil #NewsTamil24x7 pic.twitter.com/lIWW5gZCan
— News Tamil 24x7 (@NewsTamilTV24x7) September 19, 2025