
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ పంజాబీ నటుడు, బాడీ బిల్డర్ వరీందర్ సింగ్ గుమాన్(41) మరణించారు. తన గాయానికి సర్జరీ కోసం అమృత్‌సర్‌లోని ఫోర్టిస్ ఆస్పత్రికి వెళ్లిన వరీందర్ సింగ్ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. అతను కేవలం సినిమాల్లో మాత్రమే కాదు.. ఛాంపియన్ బాడీబిల్డర్ ఛాంపియన్ కూడా. అతని మరణం సినీ ఇండస్ట్రీని దిగ్భ్రాంతిని కలిగించింది.
కాగా..వరీందర్ సింగ్ గుమాన్ 2009లో మిస్టర్ ఇండియా టైటిల్ గెలుచుకున్నాడు. అంతే కాకుండా ఆ తర్వాత మిస్టర్ ఆసియాలో రన్నరప్‌గా నిలిచాడు. వరీందర్ సింగ్ బాడీ బిల్డింగ్‌తో పాటు చిత్ర పరిశ్రమలో కూడా తనదైన ముద్ర వేశారు. అతను 2012లో పంజాబీ చిత్రం 'కబడ్డీ వన్స్ ఎగైన్'లో కీలక పాత్రలో నటించాడు ఆ తర్వాత 2014లో 'రోర్: టైగర్స్ ఆఫ్ ది సుందర్‌బన్స్'తో హిందీలో రంగ ప్రవేశం చేశాడు. అతను 2019లో 'మర్జావాన్'తో సహా పలు హిందీ చిత్రాల్లో కనిపించాడు. ఇటీవలే సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ నటించిన 'టైగర్ 3'లో పాకిస్తాన్ జైలు గార్డు షకీల్ పాత్రలో గుమాన్ కనిపించాడు. టైగర్ 3 చిత్రానికి మనీష్ శర్మ దర్శకత్వం వహించారు.