
‘ది ఇండియా స్టోరీ’ సినిమాను పూర్తి చేశారు కాజల్ అగర్వాల్. శ్రేయాస్ తల్సాడే, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హిందీ సినిమా ‘ది ఇండియా స్టోరీ’. డీకే చేతన్ దర్శకత్వంలో ఎమ్‌ఐజీ ప్రోడక్షన్స్ అండ్ స్టూడియోస్ పతాకంపై సాగర్ బి. షిండే నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయినట్లు సోమవారం ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రంలో లాయర్‌గా నటించారు కాజల్.
రైతుల కష్టాలు, కార్పొరేట్ సంస్థలు తయారు చేసే పంటల పిచికారీ మందుల వ్యా పారాలు వంటి అంశాల నేపథ్యంతో ఈ సినిమా కథనం సాగుతుందని బాలీవుడ్ సమాచారం. మురళీ శర్మ, మనీష్ వాధ్యా, త్రిషా సర్ధా కీలక పాత్రల్లో నటించిన ‘ది ఇండియా స్టోరీ’ని ఆగస్టు 15న రిలీజ్ చేయాలనుకున్నా కుదరలేదు. 2026లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు మేకర్స్.