
ప్రముఖ బుల్లితెర నటుడు నందీశ్ సందు ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ప్రముఖ నటి కవితా బెనర్జీని ఆయన పెళ్లాడనున్నారు. గతనెలలో వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ జరగ్గా.. తాజాగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. సోషల్ మీడియా వేదికగా నిశ్చితార్థం చేసుకున్న ఫోటోలను షేర్ చేశారు. నందిశ్ -కవిత ఎంగేజ్‌మెంట్ వేడుక బీచ్‌లో చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషం తెలుసుకున్న పలువురు బుల్లితెర తారలు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు. కాగా.. నటి కవిత బెనర్జీ.. రిష్టన్ కా మంఝా, భాగ్య లక్ష్మి, దివ్య ప్రేమ్: ప్యార్ ఔర్ రహస్య కీ కహానీ, ఏక్ విలన్ రిటర్న్స్, హికప్స్ అండ్ హుక్అప్స్ సీరియల్స్‌తో పాటు పలు చిత్రాల్లో నటించింది.
నటి రష్మీ దేశాయ్‌తో నందీశ్ విడాకులు..
కాగా.. నందీశ్ సందు 2012లో బుల్లితెర నటి రష్మీ దేశాయ్‌ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో ఈ జంట మార్చి 2016లో విడిపోయారు. గతంలో ఈ జంట ఉత్తరన్ అనే సీరియల్ సెట్స్‌లో కలుసుకున్నారు. వీరిద్దరి స్నేహం ప్రేమగా మారి పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత నందీశ్ సందు రెండో పెళ్లికి రెడీ అయ్యారు. మరో బుల్లితెర నటి కవిత బెనర్జీతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు.
