
అన్న పెళ్లి మాటే మర్చిపోయాడు. కానీ తమ్ముడు రెండో పెళ్లి చేసుకోవడమే కాదు, 58 ఏళ్ల వయసులో రెండోసారి తండ్రిగా ప్రమోషన్ పొందాడు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ (Arbaaz Khan) గతంలో మలైకా అరోరాను పెళ్లి చేసుకోగా వీరికి అర్హాన్ ఖాన్ సంతానం. దంపతుల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో 2017లో విడాకులు తీసుకున్నారు. 2023 డిసెంబర్‌లో మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు.
ఏడాదిన్నర తిరిగేలోపు..
ఈ ఏడాది ప్రారంభంలో షురా గర్భం దాల్చింది. నేడు (అక్టోబర్ 5న) ముంబైలోని ఓ ఆస్పత్రిలో పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన సల్మాన్.. ఫామ్‌హౌస్ నుంచి నేరుగా ఆస్పత్రికి పయనమయ్యాడట! అర్బాజ్ ఖాన్.. ప్యార్ కియా తో డర్నా క్యా, హలో బ్రదర్, దబాంగ్, దబాంగ్ 2, దబాంగ్ 3, నిర్దోష్, తేరే ఇంతేజార్, మే జరూర్ ఆవుంగా వంటి పలు చిత్రాల్లో నటించాడు. తెలుగులో జై చిరంజీవ మూవీలో విలన్‌గా నటించాడు. కిట్టు ఉన్నాడు జాగ్రత్త, శివం భజే సినిమాల్లోనూ యాక్ట్ చేశాడు.