హిమాలయాల్లో రజనీకాంత్‌.. వారం రోజులు అక్కడే! | Rajinikanth Took Break from Jailer 2, Went to Himalayas | Sakshi
Sakshi News home page

Rajinikanth: జైలర్‌ 2కి బ్రేక్‌.. హిమాలయాల్లో రజనీకాంత్‌

Oct 5 2025 2:03 PM | Updated on Oct 5 2025 3:01 PM

Rajinikanth Took Break from Jailer 2, Went to Himalayas

తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth) ప్రధాన పాత్రలో నటించిన జైలర్‌ (Jailer Movie) బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించింది. 2023లో వచ్చిన ఈ మూవీకి సీక్వెల్‌గా జైలర్‌ 2 తెరకెక్కుతోంది. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్‌ 12న విడుదల కానుంది. ఇకపోతే ఈ మధ్యే రజనీ నటించిన కూలీ సినిమాకు మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చిన సంగతి తెలిసిందే! రూ.500 కోట్లు రాబట్టినప్పటికీ సినిమా విషయంలో మాత్రం అభిమానుల్లో కాస్త అసంతృప్తి అలాగే ఉంది.

హిమాలయాల్లో ప్రత్యక్షం
దీంతో జైలర్‌ 2 విషయంలో చిత్రయూనిట్‌ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ మధ్యే కేరళ షెడ్యూల్‌ పూర్తయింది. తాజాగా జైలర్‌ 2కి షూటింగ్‌కు బ్రేక్‌ ఇస్తూ రజనీకాంత్‌ హిమాలయాలకు వెళ్లారు. బిజీ షూటింగ్స్‌కు బైబై చెప్తూ వారంరోజుల సెలవు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రిషికేశ్‌ ఆశ్రమంలో రజనీ సేద తీరుతున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. బద్రీనాథ్‌, బాబా గుహ వంటి పవిత్ర స్థలాలను సైతం సందర్శించినట్లు తెలుస్తోంది.

జైలర్‌ 2
రజనీకి ఆధ్యాత్మిక చింతన ఎక్కువన్న విషయం తెలిసిందే! ప్రతి ఏడాది హిమాలయాలకు వెళ్లొస్తుంటారు. జైలర్‌ రిలీజ్‌కు ముందు కూడా అక్కడికి వెళ్లొచ్చారు. జైలర్‌ 2 విషయానికి వస్తే.. ఇందులో మోహన్‌లాల్‌, శివరాజ్‌కుమార్‌, జాకీ ష్రాఫ్‌ కీలక పాత్రల్లో నటించనున్నారు. ఫస్ట్‌ పార్ట్‌కు సంగీతం అందించిన అనిరుధ్‌ రవిచందర్‌ ఈ చిత్రానికీ పని చేస్తున్నారు. ఎస్‌జే సూర్య కూడా ఈ సినిమాలో యాక్ట్‌ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు.

చదవండి: నేను ఇంటింటికి వెళ్లి చెత్త తీస్తా.. అంత చులకనా?: శ్రీజ తండ్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement