Dil Dosti Dance Actress Vrushika Mehta Gets Engaged To Saurabh Ghedia - Sakshi
Sakshi News home page

Vrushika Mehta: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న బుల్లితెర నటి.. ఫోటోలు వైరల్

Dec 18 2022 2:40 PM | Updated on Dec 18 2022 3:13 PM

Dil Dosti Dance actress Vrushika Mehta gets engaged to Saurabh Ghedia  - Sakshi

దిల్ దోస్తీ డాన్స్, బుల్లితెర నటి రుషికా మెహతా నిశ్చితార్థం చేసుకున్నారు. కెనడాకు చెందిన తన ప్రియుడు సౌరభ్ ఘెడియాతో ఆమె ఏడడుగులు నడవనున్నారు. ఈనెల 11న నిశ్చితార్థం చేసుకున్నట్లు ఆమె తన ఇన్‌స్టాలో వెల్లడించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరలవుతున్నాయి.

 

యే రిష్తా క్యా కెహ్లతా హై, దిల్ దోస్తీ డ్యాన్స్‌లలో రుషికా మెహతా ఫేమస్ అయింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాలో ఆమె రాస్తూ..' మా ప్రారంభం ఎల్లప్పుడు ఉంటుంది.' అంటూ రాసుకొచ్చింది. ఈ వార్త విన్న ఆమె అభిమానులతో సహా పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. అయితే ఆమె ప్రియుడు సౌరభ్ గురించి వివరాలు పెద్దగా తెలియదు. అతను కెనడాలోని టొరంటోలో ఉన్నట్లు తెలుస్తోంది..

ఇండస్ట్రీలో రుషికా ప్రయాణం: దిల్ దోస్తీ డ్యాన్స్‌ షోలో షారన్ పాత్రతో రుషిక మంచి గుర్తింపు తెచ్చుకుంది. షోలో శంతనుతో కలిసి ఆమె కెమిస్ట్రీ అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఆ తరువాత ఆమె ఇష్క్‌బాజ్, యే రిష్తా క్యా కెహ్లతా హై, యే తేరీ గలియన్, సత్రంగి ససురల్ వంటి ఇతర షోలలో కూడా కనిపించింది. ఆమె అనేక మ్యూజిక్ వీడియోలు, వెబ్ షోలలో కూడా భాగమైంది. రుషికా ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఆమె అభిమానులతో చిత్రాలు, డ్యాన్స్ రీల్స్‌తో అలరిస్తూ ఉంటుంది .

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement