
సినీ ఇండస్ట్రీలో విడాకులు అనే పదం కామన్గా అయిపోయింది. కొన్నేళ్ల పాటు కలిసి ఉన్న జంటలు అభిమానులకు సడన్గా ఇలాంటి షాక్లు ఇస్తుంటారు. తాజాగా ప్రముఖ బుల్లితెర నటి సింపుల్ కౌల్ తన వివాహా బంధానికి ఎండ్ కార్డ్ పడేసింది. 15 ఏళ్ల తర్వాత తన భర్త, వ్యాపారవేత్త రాహుల్ లూంబాతో విడిపోతున్నట్లు ప్రకటించింది.
(ఇది చదవండి: చెఫ్‌గా మారిన శోభిత ధూళిపాళ్ల.. నాగచైతన్య కామెంట్ చూశారా?)
భర్తతో విడాకులపై సింపుల్ కౌల్ మాట్లాడుతూ.. "అవును మేమిద్దరం ఇటీవలే విడిపోయాం. మేము పరస్పరం చాలా పరిణతి చెందిన మనుషులం. నా జీవితంలో చాలా సంవత్సరాలు ఆయనతో కలిసి ఉన్నా. ఇకపై మేమిద్దరం పరస్పర నిర్ణయంతో విడిపోవాలని నిర్ణయించుకున్నాం' అని తెలిపింది.
గత ఇంటర్వ్యూలో సింపుల్ కౌల్ మాట్లాడుతూ.."అతను విదేశాల్లో ఎక్కువ రోజులు ఉంటారు. కొన్నిసార్లు నేను అతనిని మిస్ అవుతూ ఉంటా. కానీ మా మధ్య మంచి అవగాహన ఉంది. మా బంధం చాలా బలంగా ఉంటుంది. అందుకే మా జీవితాన్ని సమతుల్యంగా చేసుకున్నా. ఆయన లేనప్పుడు నా కెరీర్‌పై కూడా దృష్టి పెట్టగలుగుతున్నా. మా ఇద్దరికీ సంతోషకరమైన పనితో పాటు జీవితంలో సమానంగా ఎదుగుతున్నాం" అని తెలిపింది.
కాగా.. సింపుల్ కౌల్, రాహుల్ లూంబా 2010లో వివాహం చేసుకున్నారు. కుస్సుమ్తో తన కెరీర్ ప్రారంభించిన సింపుల్ కౌల్ పలు బాలీవుడ్ సీరియల్స్లో మెప్పించింది. అంతేకాకుండా 'శరరత్', 'తారక్ మెహతా కా ఊల్తా చాష్మా', 'యే మేరీ లైఫ్ హై' వంటి అనేక ప్రముఖ రియాలిటీ షోలలో కనిపించింది. సింపుల్ కౌల్ చివరిసారిగా 2022లో జిద్ది దిల్ మానే నా అనే సీరియల్లో కనిపించారు. అయితే విడిపోవడానికి గల కారణాన్ని ఆమె వెల్లడించలేదు.