
హీరోయిన్ శోభిత ధూలిపాళ్ల గతేడాది అక్కినేని హీరో నాగచైతన్యను పెళ్లాడింది. వీరిద్దరి వివాహా వేడుక హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో గ్రాండ్గా జరిగింది. ఈ పెళ్లి వేడుకలో టాలీవుడ్ ప్రముఖులు, సన్నిహితులు పాల్గొన్నారు. పెళ్లి తర్వాత అక్కినేని కోడలిగా అడుగుపెట్టిన శోభిత సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఓ మూవీలో నటిస్తోన్న శోభిత.. సెట్లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇందులో శోభిత వంట చేస్తున్న వీడియోను కూడా పోస్ట్ చేసింది. వంట చేయడం మనిషి ప్రాథమిక నైపుణ్యమని క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ఇది చూసిన నాగచైతన్య.. తన సతీమణి పోస్ట్కు అదిరిపోయే రిప్లై ఇచ్చారు. ఈ నైపుణ్యాల రుచిని చూడటానికి వేచి ఉన్నా అంటూ భార్య పోస్ట్కు కామెంట్ చేశాడు చైతూ. ఇది చూసిన అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అక్కా.. మీకు వంట కూడా వచ్చా అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ఈ ఫోటోలు, వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి.