
హీరో విజయ్ దేవరకొండ–డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనుందా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. తనకు ‘టాక్సీవాలా’ (2018) వంటి హిట్ మూవీ అందించిన దర్శకుడు రాహుల్ సంకృత్యాన్‌తో రెండో సినిమా చేస్తున్నారు విజయ్. మరోవైపు ‘రాజావారు రాణిగారు’ చిత్రదర్శకుడు రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.
ఈ రెండు చిత్రాల తర్వాత డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్‌తో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేయనున్నారని టాక్. ‘ఇష్క్, మనం, హలో, నానీస్ గ్యాంగ్‌లీడర్’ వంటి పలు చిత్రాలను తెరకెక్కించి, తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకున్నారు విక్రమ్ కె. కుమార్. ఇక ఆ మధ్యలో నితిన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తారనే వార్తలు వచ్చినప్పటికీ ఎలాంటి ప్రకటన లేదు. అయితే తన తాజా చిత్రాన్ని విజయ్‌తో చేయనున్నారట విక్రమ్. ఇందుకోసం కథ సిద్ధం చేసే పనిలో ఉన్నారట. మరి... ఈ కాంబినేషన్ సెట్ అవుతుందా? వేచి చూడాల్సిందే.