
ప్రస్తుతం శ్రావణమాసం కావడంతో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇండస్ట్రీలోనూ చాలామంది ఈ నెలలోనే పెళ్లి పీటలెక్కుతున్నారు. తాజాగా ప్రముఖ బుల్లితెర నటి గియా మానెక్ వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. 'సాత్ నిభాన సాథియా', 'జీనీ ఔర్ జుజు' సీరియల్స్తో గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ నటుడు వరుణ్ జైన్ను పెళ్లాడింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు నూతన జంటకు అభినందనలు చెబుతున్నారు.
గియా తన ఇన్స్టాలో రాస్తూ.. "ఆ దేవుడు, మా గురువుల దయతో, మీరు కురిపించిన ప్రేమతో మేము ఈ రోజు వివాహాబంధంలోకి అడుగుపెట్టాము. మేము ఇద్దరు స్నేహితులం.. కానీ ఈ రోజు చేయి చేయి కలిపి హృదయపూర్వకంగా మేము భార్యాభర్తలం అయ్యాం. ఈ రోజును ఇంత ప్రత్యేకంగా చేసిన మా ప్రియమైన వారందరి ప్రేమ, ఆశీర్వాదాలకు మా కృతజ్ఞతలు. ఎల్లప్పుడు నవ్వుతూ మిస్టర్ అండ్ మిసెస్‌గా జీవితాంతం కలిసి ఉండటానికి ఇదే మా మొదటి అడుగు." అంటూ పోస్ట్ చేసింది.
కాగా.. గియా మానెక్, వరుణ్ జైన్ జంటగా తేరా మేరా సాత్ రహే సీరియల్లో నటించారు. అప్పుడు సహనటులుగా ఉన్న వీరిద్దరు.. ఇప్పుడు భార్యాభర్తలుగా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. మరోపైపు గియా మానెక్ సీరియల్స్‌కతో పాటు సినిమాల్లోనూ నటించింది. కామ్ చాలు హై, నా గర్ కే.. నా ఘాట్ కే లాంటి చిత్రాల్లో కనిపించింది.