
బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ తెలుగువారికి కూడా సుపరిచితమైన పేరు. తెలుగులో మల్లీశ్వరి చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. ఆ తర్వాత బాలకృష్ణతో కలిసి నటించిన అల్లరి ప్రియుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. బాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన మెప్పించిన కత్రినా.. హీరో విక్కీ కౌశల్‌ను పెళ్లాడింది. ఇటీవలే ఈ జంట అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. కత్రినా గర్భంతో ఉన్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
అయితే తమ అభిమాన హీరోయిన్ ఎప్పుడు బేబికి వెల్‌కమ్ చెబుతుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ ప్రముఖ జ్యోతిష్యుడు అనిరుధ్ కుమార్ మిశ్రా జోస్యం చెప్పారు. కత్రినా- విక్కీ కౌశల్‌కు మొదటి బిడ్డగా కూతురు పుడుతుందని జోస్యం చెప్పారు. ఇది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో ఫ్యాన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మీ అంచనా కేవలం 50 శాతం మాత్రమే నిజమంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ప్రస్తుతం కూతుళ్ల సీజన్ నడుస్తోందని మరో నెటిజన్ ఫన్నీగా రాసుకొచ్చాడు. ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరలవుతోంది.
కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసిన కత్రినా కైఫ్, విక్కీ కౌశల్.. 2021 డిసెంబర్ 9న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వయసులో కత్రినా కంటే విక్కీ చిన్నవాడు. పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత ఈ జంట తల్లిదండ్రులుగా మారబోతున్నారు. సినిమాల విషయానికొస్తే.. ‘ఛావా’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విక్కీ.. ప్రస్తుతం లవ్ అండ్ వార్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. కత్రినా కైఫ్ చివరిసారిగా 2024లో విజయ్ సేతుపతితో కలిసి ‘మేరి క్రిస్మస్’ చిత్రంలో నటించింది.
The first child of Vicky Kaushal and Katrina Kaif will be a daughter. pic.twitter.com/2wjWk7SaKN
— Anirudh Kumar Mishra (Astrologer) (@Anirudh_Astro) October 8, 2025