
గత కొన్ని నెలలుగా భోజ్‌పురి నటుడు, రాజకీయ నేత పవన్ సింగ్ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈ ఈవెంట్‌లో హీరోయిన్‌తో అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వైరలైంది. దీంతో ఆమె ఏకంగా భోజ్‌పురి పరిశ్రమనే వదిలేస్తున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత పవన్ సింగ్ హీరోయిన్‌కు క్షమాపణలు చెప్పాడు. ఈ సంఘటన తర్వాత అతనిపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంచితే.. పవన్ సింగ్ రెండో భార్య జ్యోతి సింగ్ సైతం అతన్ని వదలట్లేదు. ఛాన్స్ దొరికినప్పుడల్లా అతని అరాచకాలను బయటపెడుతూ వస్తోంది. ఇటీవల ఓ సమావేశంలో పాల్గొన్న జ్యోతి సింగ్.. భోజ్‌పురి యాక్టర్‌పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. తనకు ఏకంగా గర్భస్రావం అయ్యేలా మాత్రలు ఇచ్చేవాడిని షాకింగ్ విషయాలను వెల్లడించింది. అతనికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడల్లా శారీరకంగా తనను హింసించేవాడని జ్యోతి సింగ్ ఆరోపించింది.
జ్యోతి సింగ్ మాట్లాడుతూ.. 'పవన్ సింగ్ బిడ్డ కోసం ఆరాటపడుతున్నానని అబద్దాలు చెబుతున్నాడు. బిడ్డ కోసం ఆరాటపడే వ్యక్తి తన భార్యకు గర్భస్రావం మందులు ఇవ్వడు. నాకు గర్భం వచ్చిన ప్రతిసారీ మందులు ఇచ్చేవాడు. నేను మీడియాకు చాలా విషయాలు వెల్లడించలేదు. కానీ ఈ రోజు పవన్ నన్ను కూడా బలవంతం చేశాడు. ఈ విషయంలో నేను పవన్‌ను కించపరచడం లేదు. నేను నా వాయిస్ వినిపిస్తున్నా. నాకు జరిగిన అన్యాయాన్ని మీతో పంచుకుంటున్నా' అని ఆవేదన వ్యక్తం చేసింది.
25 స్లీపింగ్ పిల్స్ తీసుకున్నా..
పవన్ సింగ్ టార్చర్ భరించలేక నిద్రమాత్రలు వేసుకునేదాన్ని.. అర్ధరాత్రి రెండు గంటలకు 25 స్లీపింగ్ పిల్ తీసుకున్నానని జ్యోతి సింగ్ వెల్లడించింది. ఆ సమయంలో అతని సోదరుడు రణు భయ్యా, దీపక్ భయ్యా, విక్కీ జీ నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారని తెలిపింది. ముంబయి అంధేరిలోని బెల్లేవ్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో నాకు చికిత్స అందించారని తన బాధను పంచుకుంది.
ఖండించిన పవన్ సింగ్..
అయితే జ్యోతి సింగ్ చేసిన ఆరోపణలను ఆమె భర్త, నటుడు పవన్ సింగ్ ఖండించారు. జ్యోతి తనపై చేసిన ఆరోపణలు అవాస్తమని కొట్టిపారేశాడు. నేను కూడా ఒక మనిషినే.. స్త్రీలు దేనికైనా కన్నీళ్లు పెట్టుకుంటారు.. అది మాత్రమే అందరికీ కనిపిస్తుంది.. కానీ ఎవరూ పురుషుడి బాధను పట్టించుకోరు.. ఎందుకంటే పురుషుడు కూడా తన బాధను చూపించలేడని అన్నారు. మరోవైపు వీరిద్దరి విడాకుల కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది.