breaking news
Pawan Singh
-
Bihar elections: పోటీపై ఊహాగానాలు.. స్పందించిన భోజ్‌పురి స్టార్ పవన్ సింగ్
పట్నా: ప్రముఖ భోజ్‌పురి నటుడు, గాయకుడు పవన్ సింగ్ తనపై వస్తున్న ఊహాగానాలను తిప్పికొట్టారు. బీహార్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని, తాను భారతీయ జనతా పార్టీకి నిజమైన సైనికుడినని చెప్పుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తానువున్న ఫోటోను షేర్ చేసిన పవన్ సింగ్.. తాను ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీలో చేరలేదని స్పష్టం చేశారు. मैं पवन सिंह अपने भोजपुरीया समाज से बताना चाहता हूँ कि मैं बिहार विधानसभा चुनाव लड़ने के लिए पार्टी ज्वाइन नहीं किया था और नाहीं मुझे विधानसभा चुनाव लड़ना है |मैं पार्टी का सच्चा सिपाही हूँ और रहूँगा। pic.twitter.com/reVNwocoav— Pawan Singh (@PawanSingh909) October 11, 2025‘నేను, పవన్ సింగ్.. మా భోజ్‌పురి కమ్యూనిటీకి ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. నేను బీహార్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి పార్టీలో చేరలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశ్యం కూడా నాకు లేదు. నేను పార్టీకి నిజమైన సైనికుడిని..అలా సైనికునిగానే ఉంటాను’ అని పవన్ సింగ్ తన ‘ఎక్స్’ పోస్టులో తెలిపారు.భోజ్‌పురి నటుడు పవన్ సింగ్ 2024లో బీజేపీ నుంచి మొదటిసారిగా పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్ నుండి పోటీకి దిగారు. అయితే తన మ్యూజిక్ వీడియో పాటల్లో బెంగాలీ మహిళలను అసభ్యకరంగా చిత్రీకరించారనే ఆరోపణలుతో పార్టీ అతన్ని పోటీ నుంచి ఉపసంహరించుకోవాలని కోరింది. దీంతో ఆయన కరకట్ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఇది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కొన్ని సీట్లను కోల్పోయేలా చేసింది.బీహార్‌లోని మొత్తం 243 నియోజకవర్గాలకు శాసనసభ ఎన్నికలు ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్నాయి. మునుపటి అసెంబ్లీ ఎన్నికలు 2020 అక్టోబర్-నవంబర్‌లో జరిగాయి. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యారు. 2022, ఆగస్టులో నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ) ఎన్డీఏతో సంబంధాలను తెంచుకుని, ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం 2024, జనవరిలో నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ) ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్ బంధన్‌తో సంబంధాలను తెంచుకుని, తిరిగి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. -
ప్రతి రోజు టార్చర్.. బలవంతంగా గర్భస్రావ మాత్రలు.. నటుడిపై సంచలన ఆరోపణలు!
గత కొన్ని నెలలుగా భోజ్‌పురి నటుడు, రాజకీయ నేత పవన్ సింగ్ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈ ఈవెంట్లో హీరోయిన్‌తో అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వైరలైంది. దీంతో ఆమె ఏకంగా భోజ్‌పురి పరిశ్రమనే వదిలేస్తున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత పవన్ సింగ్ హీరోయిన్‌కు క్షమాపణలు చెప్పాడు. ఈ సంఘటన తర్వాత అతనిపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదిలా ఉంచితే.. పవన్ సింగ్ రెండో భార్య జ్యోతి సింగ్ సైతం అతన్ని వదలట్లేదు. ఛాన్స్ దొరికినప్పుడల్లా అతని అరాచకాలను బయటపెడుతూ వస్తోంది. ఇటీవల ఓ సమావేశంలో పాల్గొన్న జ్యోతి సింగ్.. భోజ్‌పురి యాక్టర్‌పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. తనకు ఏకంగా గర్భస్రావం అయ్యేలా మాత్రలు ఇచ్చేవాడిని షాకింగ్ విషయాలను వెల్లడించింది. అతనికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడల్లా శారీరకంగా తనను హింసించేవాడని జ్యోతి సింగ్ ఆరోపించింది.జ్యోతి సింగ్ మాట్లాడుతూ.. 'పవన్ సింగ్ బిడ్డ కోసం ఆరాటపడుతున్నానని అబద్దాలు చెబుతున్నాడు. బిడ్డ కోసం ఆరాటపడే వ్యక్తి తన భార్యకు గర్భస్రావం మందులు ఇవ్వడు. నాకు గర్భం వచ్చిన ప్రతిసారీ మందులు ఇచ్చేవాడు. నేను మీడియాకు చాలా విషయాలు వెల్లడించలేదు. కానీ ఈ రోజు పవన్ నన్ను కూడా బలవంతం చేశాడు. ఈ విషయంలో నేను పవన్‌ను కించపరచడం లేదు. నేను నా వాయిస్ వినిపిస్తున్నా. నాకు జరిగిన అన్యాయాన్ని మీతో పంచుకుంటున్నా' అని ఆవేదన వ్యక్తం చేసింది.25 స్లీపింగ్ పిల్స్ తీసుకున్నా..పవన్ సింగ్ టార్చర్ భరించలేక నిద్రమాత్రలు వేసుకునేదాన్ని.. అర్ధరాత్రి రెండు గంటలకు 25 స్లీపింగ్ పిల్ తీసుకున్నానని జ్యోతి సింగ్ వెల్లడించింది. ఆ సమయంలో అతని సోదరుడు రణు భయ్యా, దీపక్ భయ్యా, విక్కీ జీ నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారని తెలిపింది. ముంబయి అంధేరిలోని బెల్లేవ్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో నాకు చికిత్స అందించారని తన బాధను పంచుకుంది.ఖండించిన పవన్ సింగ్..అయితే జ్యోతి సింగ్ చేసిన ఆరోపణలను ఆమె భర్త, నటుడు పవన్ సింగ్ ఖండించారు. జ్యోతి తనపై చేసిన ఆరోపణలు అవాస్తమని కొట్టిపారేశాడు. నేను కూడా ఒక మనిషినే.. స్త్రీలు దేనికైనా కన్నీళ్లు పెట్టుకుంటారు.. అది మాత్రమే అందరికీ కనిపిస్తుంది.. కానీ ఎవరూ పురుషుడి బాధను పట్టించుకోరు.. ఎందుకంటే పురుషుడు కూడా తన బాధను చూపించలేడని అన్నారు. మరోవైపు వీరిద్దరి విడాకుల కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. -
నా భర్త మరో అమ్మాయితో హోటల్‌కి వెళ్లాడు: హీరో పవన్ సింగ్ సతీమణి
భోజ్‌పురి సూపర్‌స్టార్, నటుడు, రాజకీయ నేత పవన్ సింగ్‌పై ఆయన రెండో సతీమణి జ్యోతి సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. రీసెంట్గా స్టేజీపై హీరోయిన్ అంజలి రాఘవ్‌ను అసభ్యకరంగా తాకి వార్తల్లో నిలిచాడు. దీంతో ఆమె ఏకంగా భోజ్‌పురి పరిశ్రమనే వదిలేస్తున్నట్లు ప్రకటించడంతో తనకు తప్పుడు ఉద్దేశం లేదని క్షమాపణలు చెప్పాడు. అయితే, తాజాగా ఆయనపై జ్యోతి సింగ్ సంచలన ఆరోపణలు చేసింది.పవన్ సింగ్, జ్యోతి సింగ్ ఇద్దరూ పలు విభేదాలతో దూరంగానే ఉంటున్నారు. ఈ క్రమంలోనే జ్యోతి సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పోస్ట్ చేసింది. తాను తన భర్త పవన్ సింగ్ ఇంటికి వెళ్తే తనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారని పోలీసులపై భగ్గుమంది. ఇప్పుడు పోలీసులు తనను తీసుకెళ్లడానికి వచ్చారంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో ఆమె మాట్లాడుతూ.. “ భార్యను బయటకు గెంటేయాలని పోలీసులను పిలిపించుకున్న ఈ పవన్ సింగ్ సమాజానికి సేవ చేస్తాడా..? ఎన్నికలు జరిగినప్పుడు నాకు ఫోన్ చేసి నా పేరు ఉపయోగించాడు. అవి అయిపోయిన తర్వాత అతను మరొక అమ్మాయితో హోటల్‌కు వెళ్తాడు. కానీ, నన్ను మాత్రం భర్త ఇంటికి ఎందుకు వెళ్లడం లేదని అందరూ ప్రశ్నిస్తున్నారు. అతని తప్పులను ఎవరూ అడగరు. ఆయన మాత్రం మా ముందే ఒక అమ్మాయిని తీసుకుని హోటల్‌కు వెళ్తాడు. దీనిని ఎవరూ అడగరు. భార్యగా, నా భర్త వేరే అమ్మాయితో ఉండటం చూసి నేను భరించలేకపోయాను, అందుకే నేను అక్కడి నుంచి వెళ్లిపోయాను. అని ఆమె చెప్పింది.పవన్ సింగ్ గతంలో(2014లో) ప్రియకుమారి సింగ్‌ను పెళ్లాడాడు. కేవలం ఏడాది మాత్రమే వీరు కలిసున్నారు. తర్వాత విడాకులు తీసుకున్నారు. 2018లో పవన్.. జ్యోతి సింగ్‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు. కానీ, వీరి మధ్య కూడా గొడవలు రావడంతో దూరంగానే ఉంటున్నారు. ఈ ఏడాది జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ సింగ్ బీజేపీ నుంచి పోటీ చేయనున్నాడని సమాచారం. View this post on Instagram A post shared by Jyoti P Singh (@jyotipsingh999) -
మళ్లీ బీజేపీలోకి భోజ్‌పురి స్టార్ పవన్ సింగ్.. ‘టిక్కెట్’ కోసం భేటీలు
న్యూఢిల్లీ: భోజ్‌పురి నటుడు, గాయకుడు పవన్ సింగ్ రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా ఆయన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ)చీఫ్ ఉపేంద్ర కుష్వాహా, బీజేపీ సీనియర్ నేత వినోద్ తవ్డేలతో దేశ రాజధాని ఢిల్లీలో భేటీ అయ్యారు. ఇది బీహార్ రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీసింది. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన తవ్డే.. పవన్ సింగ్ బీజేపీలోనే ఉంటారని ధృవీకరించారు. ఆయన ఉపేంద్ర కుష్వాహా నుండి ఆశీస్సులు పొందారని, రాబోయే ఎన్నికల్లో బీజేపీలో చురుకుగా పని చేస్తారన్నారు.బీహార్ ఎన్నికలకు ముందు భోజ్‌పురి స్టార్ పవన్ సింగ్ బీజేపీ నేతలను కలుసుకోవడం కీలక పరిణామంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. భోజ్‌పురి మాట్లాడే ఓటర్లలో ఆయనకు ఎంతో ఆదరణ ఉంది.ఈ పరిణామం బీజేపీ నేతలను, కార్యకర్తలను ఉత్సాహ పరుస్తుందని, పార్టీ ప్రచారానికి కొత్త ఊపు వస్తుందని పలువురు భావిస్తున్నారు. అయితే గత లోక్‌సభ ఎన్నికల్లో కరకట్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా పవన్ సింగ్ బరిలోకి దిగడం ఉపేంద్ర కుష్వాహా ఓటమికి ప్రధాన కారణంగా నిలిచిందంటారు. రాజ్‌పుత్ వర్గం కుష్వాహాకు మద్దతు ఇవ్వలేదని, ఇది సమీప నియోజకవర్గాలపై కూడా ప్రభావం చూపిందని విశ్లేషకులు చెబుతుంటారు. ఫలితంగా షహాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాలలో బీజేపీకి గణనీయమైన నష్టం వాటిల్లిందని అంటారు.భోజ్‌పురి నటుడు పవన్ సింగ్ 2024లో మొదటిసారిగా పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్ నుండి పోటీకి నిలిపారు. అయితే అతను తన మ్యూజిక్ వీడియో పాటల్లో బెంగాలీ మహిళలను అసభ్యకరంగా చిత్రీకరించారనే ఆరోపణలుతో పార్టీ అతన్ని పోటీ నుంచి ఉపసంహరించుకోవాలని కోరింది. దీంతో ఆయన కరకట్ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఇది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కొన్ని సీట్లను కోల్పోయేలా చేసింది.బీహార్‌లోని మొత్తం 243 నియోజకవర్గాలకు శాసనసభ ఎన్నికలు ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్నాయి. ఎన్నికల సంఘం ఇంకా తేదీలను ప్రకటించలేదు. మునుపటి అసెంబ్లీ ఎన్నికలు 2020 అక్టోబర్-నవంబర్‌లో జరిగాయి. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యారు. 2022, ఆగస్టులో నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ) ఎన్డీఏతో సంబంధాలను తెంచుకుని, ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం 2024, జనవరిలో నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ) ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్ బంధన్‌తో సంబంధాలను తెంచుకుని, తిరిగి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. -
జీవితంపైనే అసహ్యం.. నాకు చావే దిక్కు!: హీరో రెండో భార్య ఆవేదన
స్టేజీపై హీరోయిన్‌తో అసభ్యంగా ప్రవర్తించి విమర్శలపాలయ్యాడు భోజ్‌పురి స్టార్ హీరో పవన్ సింగ్ (Pawan Singh). ఈ ఘటన వల్ల ఏకంగా భోజ్‌పురి సినీ ఇండస్ట్రీ నుంచే తప్పుకున్నట్లు ప్రకటించింది సింగర్, హీరోయిన్ అంజలి రాఘవ్. దాంతో పవన్ సింగ్ ఆమెకు క్షమాపణలు చెప్పాడు. తనకు ఎలాంటి దురుద్దేశం లేదని, తన వల్ల ఇబ్బంది కలిగినందుకు క్షమించమని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. మరో వివాదంలో హీరోతనకంటే సీనియర్ ఆర్టిస్ట్ అయినందున అతడిని క్షమిస్తున్నానంటూ ఈ వివాదానికి ముగింపు పలికింది అంజలి. కానీ ఇప్పుడు మరో వివాదం తెరపైకి వచ్చింది. పవన్ తనను పట్టించుకోవట్లేదని ఘొల్లుమంటోంది అతడి రెండో భార్య జ్యోతి. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టింది. నీతో మాట్లాడాలని కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్నాను. నువ్వు లేదా నీ చుట్టూ ఉన్నవాళ్లో నాకు తెలీదు కానీ.. నా కాల్స్, మెసేజ్‌లకు ఎటువంటి రిప్లై ఇవ్వడం లేదు.ఏ పాపం చేశా?నీతో మాట్లాడాలని లక్నో వస్తే నన్ను కలవడానికి కూడా నువ్వు ఇష్టపడలేదు. రెండు నెలల క్రితం నా తండ్రి కూడా నిన్ను కలిసేందుకు ప్రయత్నించగా.. ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. నేను ఏ తప్పు చేశానని నన్ను ఇలా శిక్షిస్తున్నావు? నీ భార్యగా ఉండే అర్హత నాకు లేకపోతే నన్నెప్పుడో వదిలేసి ఉండేవాడివి. కానీ, అలా చేయలేదు. పైగా లోక్‌సభ ఎన్నికల సమయంలో నాకు లేనిపోని ఆశలు ఎందుకు కల్పించావు? చావే దిక్కుఈరోజు ఆత్మాహుతి తప్ప నాకు మరో మార్గం కనిపించడం లేదు. కానీ, నేను చావాలనుకోవడం లేదు. ఎందుకంటే నేను చనిపోతే నన్ను, నా పేరెంట్స్‌నే తప్పుబడతారు. నేను నీ భార్యని, నీ కుటుంబంలో ఒకదాన్ని.. ఒకప్పుడు నీపై విషం చిమ్మినవారితో నువ్వు చేతులు కలుపుతున్నావ్.. కానీ, నీ భార్య బాధను గుర్తించలేకపోవుతన్నావ్.. అది తల్చుకుంటేనే కన్నీళ్లొస్తున్నాయి. ఏడేళ్లుగా ఈ బాధలతో సతమతమవుతున్నా.. చివరిసారిగా అడుగుతున్నా..నా జీవితంపై నాకే అసహ్యమేస్తోంది. చివరిసారిగా అడుగుతున్నా.. నాతో మాట్లాడు. నా ఫోన్ ఎత్తు, నా బాధను ఒక్కసారైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అని జ్యోతి సింగ్ రాసుకొచ్చింది. పవన్ సింగ్ గతంలో(2014లో) ప్రియకుమారి సింగ్‌ను పెళ్లాడాడు. కేవలం ఏడాది మాత్రమే వీరు కలిసున్నారు. తర్వాత విడాకులు తీసుకున్నారు. 2018లో పవన్.. జ్యోతి సింగ్‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు. View this post on Instagram A post shared by Jyoti P Singh (@jyotipsingh999) ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.comచదవండి: కన్నీళ్లు పెట్టించే మూవీ.. చేయని తప్పుకు అమ్మాయి జీవితం బలి! -
హీరో అసభ్య ప్రవర్తన.. నేను ఎంజాయ్ చేయలేదు, ఏడ్చా.. ఇండస్ట్రీకో దండం!
భోజ్‌పురి స్టార్ హీరో పవన్ సింగ్ (Pawan Singh).. ఓ స్టేజీపై హీరోయిన్ అంజలి రాఘవ్ (Anjali Raghav)ను అసభ్యంగా తాకిన వీడియో సోషల్ మీడియాలో ఎంతగానో వైరలయింది. హీరోయిన్ అసౌకర్యంగా ఫీలవుతున్నా సరే పదేపదే అతడు ఆమె నడుము తాకాడు. లోలోపల ఇబ్బందిగా ఫీలైనప్పటికీ పైకి మాత్రం అంజలి నవ్వుతూ కనిపించింది. లక్నోలో 'సైయా సేవా కరే' పాట ప్రమోషనల్ ఈవెంట్లో ఈ ఘటన జరిగింది.ఏదో ఉందని చెప్పడం వల్లే..తాజాగా ఈ ఘటనపై అంజలి స్పందించింది. కొందరు నన్ను కూడా తప్పుపడుతున్నారు. ఆమె కూడా ఎంజాయ్ చేస్తోంది, నవ్వుతోంది అని కామెంట్స్ చేశారు. నా అనుమతి లేకుండా ఇష్టమొచ్చినట్లు టచ్ చేస్తుంటే నేను సంతోషపడతానా? దాన్ని ఆస్వాదిస్తానని ఎలా అనుకుంటున్నారు? పవన్ సింగ్ నా నడుము దగ్గర ఏదో ఉందన్నారు. నేను నా చీర తట్టుకుందేమో, లేదా జాకెట్ ట్యాగ్ ఏమైనా ఉందా? అని చూస్తున్నాను. ఏడ్చేశా..ట్యాగ్ అలాగే మర్చిపోయానా? ఏంటి? అని నవ్వాను. ఈవెంట్ అయిపోయాక నా టీమ్‌ను పిలిచి చూడమంటే అక్కడ ఏమీ లేదన్నారు. అప్పుడు నాకు బాధ, కోపం రెండూ తన్నుకుంటూ వచ్చాయి. ఏడ్చేశాను కూడా! అనుమతి లేకుండా ఏ ఆడపిల్లను కూడా తాకకూడదు. అందులోనూ అసభ్యంగా తాకితే అస్సలు ఒప్పుకోము. ఇకపై నేను భోజ్‌పురిలో పని చేయను అని చెప్పుకొచ్చింది. అంజలి రాఘవ్.. భోజ్‌పురిలో ప్రైవేట్ సాంగ్స్‌లో యాక్ట్ చేసింది. అలాగే పలు చిత్రాల్లోనూ నటించింది. View this post on Instagram A post shared by Anjali Raghav (@anjaliraghavonline) View this post on Instagram A post shared by Anjali Raghav (@anjaliraghavonline) చదవండి: ఎంగేజ్మెంట్తో మారిపోయా.. ఇకపై అలాంటి సీన్లు చేయను: విశాల్ -
స్టేజీపై హీరో షాకింగ్ ప్రవర్తన.. హీరోయిన్ నడుము తాకుతా
ఎలాంటి వ్యక్తి అయినా సరే నలుగురిలో ఉన్నప్పుడు హుందాగా ప్రవర్తించాల్సి ఉంటుంది. అయితే కొందరు సెలబ్రిటీలు మాత్రం పబ్లిక్ ప్లేస్‌ల్లోనూ విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఇప్పుడు కూడా అలాంటి ఓ సంఘటన అందరినీ షాక్‌కి గురిచేసింది. ఓ స్టార్ హీరో తన పక్కన మాట్లాడుతున్న హీరోయిన్ నడుము తాకుతూ అసభ్యంగా కనిపించాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో సదరు హీరోపై విమర్శలు వస్తున్నాయి.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ కంటెస్టెంట్ లోబోకు జైలు శిక్ష)టాలీవుడ్, బాలీవుడ్లానే భోజ్‌పురి సినిమా ఇండస్ట్రీ కూడా ఉంది. ఇందులో కాస్త గుర్తింపు ఉన్న హీరో పవన్ సింగ్. ఇతడే ఇప్పుడు చర్చకు కారణమయ్యాడు. తాజాగా ఓ ఈవెంట్‌కి హాజరైన ఇతడు.. తన పక్కనే నిలబడి మాట్లాడుతున్న నటి అంజలి నడుముని పదే పదే తాకుతా చిత్రంగా ప్రవర్తించాడు. ఆమె అసౌకర్యానికి గురవుతున్నా సరే అందరూ చూస్తుండటంతో నవ్వుతూ కవర్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో బయటకు రావడంతో పవన్‌పై గట్టిగానే విమర్శలు వస్తున్నాయి.ఇండస్ట్రీ అంటేనే చాలామందికి చిన్నచూపు ఉంది. కానీ ఒకప్పటితో పోలిస్తే నటీమణుల్లో కాస్త చైతన్యం వచ్చింది. తమకు ఇలాంటి అసౌకర్యం జరిగితే బయటకొచ్చి చెబుతున్నారు. మీటూ ఉద్యమం కూడా అప్పట్లో పెద్ద ఎత్తున నడిచింది. అయినా సరే కొందరు హీరోలు ఇలా పబ్లిక్‌గా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. మరి దీన్ని పవన్ సింగ్ ఎలా కవర్ చేసుకుంటాడనేది చూడాలి? ప్రస్తుతం భోజ్‌పురిలో సినిమాలు చేస్తున్న ఇతడు.. త్వరలో బాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు?(ఇదీ చదవండి: ‘త్రిబాణధారి బార్బరిక్’ రివ్యూ)भोजपुरी के कथित सुपरस्टारकभी भाजपा से सांसद बनना चाह रहे थे और आज ये हरतक...#PawanSingh pic.twitter.com/zVy3iJgvlC— AJAY (@ajaygautamm) August 28, 2025