
భోజ్‌పురి సూపర్‌స్టార్, నటుడు, రాజకీయ నేత పవన్ సింగ్‌పై ఆయన రెండో సతీమణి జ్యోతి సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. రీసెంట్‌గా స్టేజీపై హీరోయిన్ అంజలి రాఘవ్‌ను అసభ్యకరంగా తాకి వార్తల్లో నిలిచాడు. దీంతో ఆమె ఏకంగా భోజ్‌పురి పరిశ్రమనే వదిలేస్తున్నట్లు ప్రకటించడంతో తనకు తప్పుడు ఉద్దేశం లేదని క్షమాపణలు చెప్పాడు. అయితే, తాజాగా ఆయనపై జ్యోతి సింగ్ సంచలన ఆరోపణలు చేసింది.

పవన్ సింగ్, జ్యోతి సింగ్ ఇద్దరూ పలు విభేదాలతో దూరంగానే ఉంటున్నారు. ఈ క్రమంలోనే జ్యోతి సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పోస్ట్ చేసింది. తాను తన భర్త పవన్ సింగ్ ఇంటికి వెళ్తే తనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారని పోలీసులపై భగ్గుమంది. ఇప్పుడు పోలీసులు తనను తీసుకెళ్లడానికి వచ్చారంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ఆమె మాట్లాడుతూ.. “ భార్యను బయటకు గెంటేయాలని పోలీసులను పిలిపించుకున్న ఈ పవన్ సింగ్ సమాజానికి సేవ చేస్తాడా..? ఎన్నికలు జరిగినప్పుడు నాకు ఫోన్ చేసి నా పేరు ఉపయోగించాడు. అవి అయిపోయిన తర్వాత అతను మరొక అమ్మాయితో హోటల్‌కు వెళ్తాడు. కానీ, నన్ను మాత్రం భర్త ఇంటికి ఎందుకు వెళ్లడం లేదని అందరూ ప్రశ్నిస్తున్నారు. అతని తప్పులను ఎవరూ అడగరు. ఆయన మాత్రం మా ముందే ఒక అమ్మాయిని తీసుకుని హోటల్‌కు వెళ్తాడు. దీనిని ఎవరూ అడగరు. భార్యగా, నా భర్త వేరే అమ్మాయితో ఉండటం చూసి నేను భరించలేకపోయాను, అందుకే నేను అక్కడి నుంచి వెళ్లిపోయాను. అని ఆమె చెప్పింది.
పవన్ సింగ్ గతంలో(2014లో) ప్రియకుమారి సింగ్‌ను పెళ్లాడాడు. కేవలం ఏడాది మాత్రమే వీరు కలిసున్నారు. తర్వాత విడాకులు తీసుకున్నారు. 2018లో పవన్.. జ్యోతి సింగ్‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు. కానీ, వీరి మధ్య కూడా గొడవలు రావడంతో దూరంగానే ఉంటున్నారు. ఈ ఏడాది జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ సింగ్ బీజేపీ నుంచి పోటీ చేయనున్నాడని సమాచారం.