
భోజ్‌పురి స్టార్ హీరో పవన్ సింగ్ (Pawan Singh).. ఓ స్టేజీపై హీరోయిన్ అంజలి రాఘవ్ (Anjali Raghav)ను అసభ్యంగా తాకిన వీడియో సోషల్ మీడియాలో ఎంతగానో వైరలయింది. హీరోయిన్ అసౌకర్యంగా ఫీలవుతున్నా సరే పదేపదే అతడు ఆమె నడుము తాకాడు. లోలోపల ఇబ్బందిగా ఫీలైనప్పటికీ పైకి మాత్రం అంజలి నవ్వుతూ కనిపించింది. లక్నోలో 'సైయా సేవా కరే' పాట ప్రమోషనల్ ఈవెంట్‌లో ఈ ఘటన జరిగింది.
ఏదో ఉందని చెప్పడం వల్లే..
తాజాగా ఈ ఘటనపై అంజలి స్పందించింది. కొందరు నన్ను కూడా తప్పుపడుతున్నారు. ఆమె కూడా ఎంజాయ్ చేస్తోంది, నవ్వుతోంది అని కామెంట్స్ చేశారు. నా అనుమతి లేకుండా ఇష్టమొచ్చినట్లు టచ్ చేస్తుంటే నేను సంతోషపడతానా? దాన్ని ఆస్వాదిస్తానని ఎలా అనుకుంటున్నారు? పవన్ సింగ్ నా నడుము దగ్గర ఏదో ఉందన్నారు. నేను నా చీర తట్టుకుందేమో, లేదా జాకెట్ ట్యాగ్ ఏమైనా ఉందా? అని చూస్తున్నాను.
ఏడ్చేశా..
ట్యాగ్ అలాగే మర్చిపోయానా? ఏంటి? అని నవ్వాను. ఈవెంట్ అయిపోయాక నా టీమ్‌ను పిలిచి చూడమంటే అక్కడ ఏమీ లేదన్నారు. అప్పుడు నాకు బాధ, కోపం రెండూ తన్నుకుంటూ వచ్చాయి. ఏడ్చేశాను కూడా! అనుమతి లేకుండా ఏ ఆడపిల్లను కూడా తాకకూడదు. అందులోనూ అసభ్యంగా తాకితే అస్సలు ఒప్పుకోము. ఇకపై నేను భోజ్‌పురిలో పని చేయను అని చెప్పుకొచ్చింది. అంజలి రాఘవ్.. భోజ్‌పురిలో ప్రైవేట్ సాంగ్స్‌లో యాక్ట్ చేసింది. అలాగే పలు చిత్రాల్లోనూ నటించింది.
చదవండి: ఎంగేజ్‌మెంట్‌తో మారిపోయా.. ఇకపై అలాంటి సీన్లు చేయను: విశాల్