
'నడిగర్ సంఘం భవనం పూర్తయినప్పుడే నా పెళ్లి' అని శపథం చేశాడు స్టార్ హీరో విశాల్ (Vishal). దానికోసం తన వివాహాన్ని వాయిదా వేస్తూ వస్తున్నాడు. నిన్న (ఆగస్టు 29న) విశాల్ 48వ బర్త్‌డే.. ఈ పుట్టినరోజే తన పెళ్లిరోజు కానుందని గతంలో ప్రకటించాడు. కానీ ఇంకా నడిగర్ సంఘం భవంతి పూర్తి కాకపోవడంతో ప్రస్తుతం ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. హీరోయిన్ సాయిధన్సిక వేలికి ఉంగరం తొడిగాడు.
చివరి బ్యాచిలర్ బర్త్‌డే..
నిశ్చితార్థం తర్వాత విశాల్ మాట్లాడుతూ.. ఇది నా చివరి బ్యాచిలర్ బర్త్‌డే. ఎంగేజ్‌మెంట్ విషెస్ చెప్పిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు. తొమ్మిదేళ్లుగా నడిగర్ సంఘం భవంతి కోసం ఎదురుచూస్తున్నాం. ఇంకో రెండు నెలల్లో అది పూర్తయిపోతుంది. ఈ బిల్డింగ్ కోసం పనిచేస్తున్నప్పుడే ధన్సిక, నేను కలుసుకున్నాం. ఇప్పుడు ఒక్కటి కాబోతున్నాం. మేమిద్దరం ఇంతవరకు ఏ సినిమాలోనూ జంటగా నటించలేదు.
అలాంటి సీన్లు చేయను
బిల్డింగ్ ప్రారంభోత్సవం అయిన మరుసటిరోజే నా పెళ్లి జరుగుతుంది. నా బ్యాచిలర్ లైఫ్ ముగియబోతోంది. కాబట్టి నేను చాలా మారాలి. అలా అని రొమాంటిక్ సినిమాలు చేయననుకునేరు, చేస్తాను! కానీ ఇకమీదట ముద్దు సన్నివేశాల్లో నటించను అని చెప్పుకొచ్చాడు. విశాల్ ప్రస్తుతం 'మకుటం' మూవీ చేస్తున్నాడు. నిర్మాత ఆర్‌బీ చౌదరి కెరీర్‌లో ఇది 99వ చిత్రంగా రాబోతోంది. రవి అరసు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో విశాల్ మూడు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నాడు.
చదవండి: ఐశ్వర్యరాయ్ మూవీ.. నటించేందుకు ఏ హీరో సాహసం చేయలేదు!