
మలయాళ స్టార్ మమ్ముట్టి (Mammootty), హీరోయిన్ ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai) జంటగా నటించిన చిత్రం కందుకొండైన్ కందుకొండైన్ (Kandukondain Kandukondain). 2000వ సంవత్సరంలో వచ్చిన ఈ మూవీలో టబు, అజిత్, అబ్బాస్ కీలక పాత్రలు పోషించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. అయితే ఈ మూవీకి మొదట మమ్ముట్టిని అనుకోలేదంటున్నాడు దర్శకుడు రాజీవ్ మీనన్.
దివ్యాంగుడిగా నటించలేమన్నారు
తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజీవ్ మీనన్ మాట్లాడుతూ.. ఈ మూవీలో కథానాయకుడి పాత్ర కోసం చాలామంది హీరోలను సంప్రదించాను. కానీ, ఎవరూ ముందుకు రాలేదు. ఇందులో హీరో యుద్ధంలో పాల్గొని కాలు కోల్పోతాడు. మరోవైపు తాగుబోతుగా మారతాడు. అది విన్నాక ఏ హీరో కూడా ఈ సినిమా చేసేందుకు ఆసక్తి చూపించలేదు. దివ్యాంగుడిగా నటించలేమని మొహం మీదే చెప్పారు.
మమ్ముట్టి మాత్రం..
కానీ, మమ్ముట్టి అదొక లోపంగా అస్సలు భావించలేదు. వెంటనే ఒప్పేసుకున్నాడు. మేజర్ బాలాగా నటించాడు. మేజర్ బాలా యుద్ధంలో కుడి కాలు కోల్పోతాడు. దీంతో ఒకవైపు ఒరిగి వంగుతూ నడుస్తాడు. కానీ సెట్‌లో ఒక్కోసారి తను కోల్పోయింది కుడి కాలా? ఎడమ కాలా? అని మర్చిపోయేవాడు. మళ్లీ వచ్చి అడిగేవాడు. అప్పుడు సరదాగా నవ్వుకునేవాళ్లం అని చెప్పుకొచ్చాడు.
చదవండి: అల్లు అరవింద్ కుటుంబంలో విషాదం