
ఎలాంటి వ్యక్తి అయినా సరే నలుగురిలో ఉన్నప్పుడు హుందాగా ప్రవర్తించాల్సి ఉంటుంది. అయితే కొందరు సెలబ్రిటీలు మాత్రం పబ్లిక్ ప్లేస్‌ల్లోనూ విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఇప్పుడు కూడా అలాంటి ఓ సంఘటన అందరినీ షాక్‌కి గురిచేసింది. ఓ స్టార్ హీరో తన పక్కన మాట్లాడుతున్న హీరోయిన్ నడుము తాకుతూ అసభ్యంగా కనిపించాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో సదరు హీరోపై విమర్శలు వస్తున్నాయి.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ కంటెస్టెంట్ లోబోకు జైలు శిక్ష)
టాలీవుడ్, బాలీవుడ్‌లానే భోజ్‌పురి సినిమా ఇండస్ట్రీ కూడా ఉంది. ఇందులో కాస్త గుర్తింపు ఉన్న హీరో పవన్ సింగ్. ఇతడే ఇప్పుడు చర్చకు కారణమయ్యాడు. తాజాగా ఓ ఈవెంట్‌కి హాజరైన ఇతడు.. తన పక్కనే నిలబడి మాట్లాడుతున్న నటి అంజలి నడుముని పదే పదే తాకుతా చిత్రంగా ప్రవర్తించాడు. ఆమె అసౌకర్యానికి గురవుతున్నా సరే అందరూ చూస్తుండటంతో నవ్వుతూ కవర్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో బయటకు రావడంతో పవన్‌పై గట్టిగానే విమర్శలు వస్తున్నాయి.
ఇండస్ట్రీ అంటేనే చాలామందికి చిన్నచూపు ఉంది. కానీ ఒకప్పటితో పోలిస్తే నటీమణుల్లో కాస్త చైతన్యం వచ్చింది. తమకు ఇలాంటి అసౌకర్యం జరిగితే బయటకొచ్చి చెబుతున్నారు. మీటూ ఉద్యమం కూడా అప్పట్లో పెద్ద ఎత్తున నడిచింది. అయినా సరే కొందరు హీరోలు ఇలా పబ్లిక్‌గా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. మరి దీన్ని పవన్ సింగ్ ఎలా కవర్ చేసుకుంటాడనేది చూడాలి? ప్రస్తుతం భోజ్‌పురిలో సినిమాలు చేస్తున్న ఇతడు.. త్వరలో బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు?
(ఇదీ చదవండి: ‘త్రిబాణధారి బార్బరిక్’ రివ్యూ)
भोजपुरी के कथित सुपरस्टार
कभी भाजपा से सांसद बनना चाह रहे थे और आज ये हरतक...#PawanSingh pic.twitter.com/zVy3iJgvlC— AJAY (@ajaygautamm) August 28, 2025