రిలీజ్ డేట్ గందరగోళం.. సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన మూవీ | Sakshi
Sakshi News home page

Tiger 3 OTT: కన్ఫ్యూజన్ చేసి ఓటీటీలో రిలీజ్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

Published Sun, Jan 7 2024 7:34 AM

Salman Khan Tiger 3 Movie OTT Streaming Details Telugu - Sakshi

మరో యాక్షన్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అయితే ఈ మూవీ కోసం జరిగిన గందరగోళం మరో దాని విషయంలో జరగలేదని చెప్పొచ్చు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఫలానా తేదీన స్ట్రీమింగ్ అవుతుందన్నట్లు వార్తలొచ్చాయి. కాదుకాదు ఇప్పట్లో రాదని మరో పోస్టర్ వైరల్ అయింది. ఇప్పుడవన్నీ కాదన్నట్లు అసలు ఏ మాత్రం సౌండ్ చేయకుండా సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా చిత్రం?

(ఇదీ చదవండి: పుట్టిన బిడ్డని కోల్పోయిన 'జబర్దస్త్' కమెడియన్ అవినాష్)

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ లేటెస్ట్ మూవీ 'టైగర్ 3'. దీపావళి కానుకగా నవంబరు 12న థియేటర్లలో విడుదల చేశారు. యష్ రాజ్ స్పై యూనివర్స్‌లో భాగంగా దీన్ని తీశారు. కాకపోతే దీని ముందు చిత్రాలైన 'ఏక్ థా టైగర్', 'టైగర్ జిందా హై' తరహాలో ఇది అలరించలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర చతికిలపడిపోయింది. ఈ క్రమంలోనే ఓటీటీలోకి త్వరగా వచ్చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు.

నవంబరు 12న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. డిసెంబరు తొలివారంలోనే ఓటీటీలోకి వచ్చేయాల్సింది. కానీ దాన్ని అలా వాయిదా వేస్తూ వచ్చారు. చివరకు జనవరి 7న స్ట్రీమింగ్ అవుతుందన్నట్లు చెప్పారు. కానీ చివరి నిమిషంలో 'కమింగ్ సూన్' అన్నట్లు మరో పోస్టర్ రిలీజ్ చేశారు. ఇలా కాస్త కన్ఫ్యూజ్ చేశారు. కానీ ఇప్పుడేమో సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లోకి తీసుకొచ్చారు. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. విచిత్రమైన విషయం ఏంటంటే.. థియేటర్లలో, ఓటీటీలో ఇలా రెండు చోట్ల ఈ సినిమా ఆదివారమే రిలీజైంది.

(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతున్న ఆ తెలుగు సినిమా.. డేట్ ఫిక్స్)

Advertisement
 
Advertisement