
ఓటీటీలో క్రైమ్ జోనర్ చిత్రాలకు ఫుల్ డిమాండ్ ఉంటోంది. ముఖ్యంగా క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రాలకు ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. అందువల్లే అభిమానుల అభిరుచికి తగినట్లుగానే అలాంటి సినిమాలే ఎక్కువ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇక మలయాళ సినిమాలకు ఓటీటీలో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. అందుకే మాలీవుడ్ సినిమాలు ఓటీటీల్లో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంటున్నాయి.
తాజాగా మరో మలయాళ మిస్టరీ థ్రిల్లర్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేస్తోంది. గతేడాది థియేటర్లలో విడుదలైన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఈ నెలలోనే ఓటీటీలో సందడి చేయనుంది. బినో అగస్టీన్ దర్శకత్వం వహించిన బిగ్‌బెన్ మూవీ ఈనెల 30 నుంచే సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ థ్రిల్లర్ సినిమాలో అనుమోహన్, వినయ్ పోర్ట్, అదితి రవి, మియా జార్జ్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను యధార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించారు.
కాగా.. ఈ ఏడాది మార్చిలోనే ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్లు సన్ నెక్స్ట్ ప్రకటించింది. కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. చివరికీ ఈ శుక్రవారం బిగ్‌బెన్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. గత ఏడాది జూన్ నెలాఖరున ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీలో హీరోయిన్‌గా నటించిన మియా జార్జ్ తెలుగులోనూ నటించింది. ఉంగరాల రాంబాబు మూవీలో సునీల్‌కు జోడీగా కనిపించింది. ఆమె నటించిన పలు తమిళ, మలయాళ సినిమాలు తెలుగులోనూ అందుబాటులోకి వచ్చాయి.
A ticking clock. ⏰
A missing child.
And a truth that may shatter everything.
Find out what else unravels when a botched kidnapping brings everything to light!!
Big Ben - Coming soon, on SunNXT !#SunNXT #BigBenOnSunNXT #Mollywood pic.twitter.com/tDyPGQY9TN— SUN NXT (@sunnxt) May 27, 2025