ఓటీటీకి వచ్చేస్తోన్న హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Tovino Thomas Action Thriller Streaming On This Ott From This Date | Sakshi
Sakshi News home page

Narivetta Ott: ఓటీటీకి మలయాళ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Jul 2 2025 8:28 PM | Updated on Jul 2 2025 8:54 PM

Tovino Thomas Action Thriller Streaming On This Ott From This Date

ఓటీటీలో మలయాళ చిత్రాలకు పుల్ డిమాండ్ ఉంటోంది.  గతంలో వచ్చిన పలు సినిమాలు ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిన్న సినిమాలు సైతం డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో ఆడియన్స్‌ను ఆదరణ దక్కించుకున్నాయి. మలయాళంలో నుంచి వచ్చే చిత్రాల్లో ఎక్కువగా క్రైమ్ థ్రిల్లర్‌ జోనర్‌ కావడంతో ఓటీటీల్లో సత్తా చాటుతున్నాయి. తాజాగా మరో మలయాళ చిత్రం ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది.

టొవినో థామస్ హీరోగా వచ్చిన యాక్షన్ థ్రిల్లర్‌ మూవీ నరివెట్ట స్ట్రీమింగ్‌కు వచ్చేస్తోంది. మలయాళ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ సొంతం చేసుకున్న ఈ సినిమా ఓటీటీలో సందడి చేయనుంది. ఈనెల 11 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేసింది. ఈ సినిమా మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. 

 కాగా.. ఈ  సినిమాలో టొవినో థామస్ పోలీస్ కానిస్టేబుల్‌గా నటించగా.. సూరజ్‌ వెంజరమూడు, చేరన్‌  కీలక పాత్రలు పోషించారు. ఈ యాక్షన్‌ మూవీకి అనురాజ్‌ మనోహర్‌ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది మే 23న మలయాళంలో విడుదలైన ఈ సినిమా.. తెలుగులోనూ మే 30న రిలీజైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement