
'ప్రేమలు' సినిమాతో హీరోయిన్ మమిత బైజు గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సూర్య, ప్రదీప్ రంగనాథన్ లాంటి హీరోలతో మూవీస్ చేస్తోంది. ఇదే చిత్రంలో హీరోగా నటించిన నస్లేన్ కూడా వరస సినిమాలు చేస్తున్నాడు. అలా ఇతడు నటించిన లేటెస్ట్ మూవీ.. మలయాళంతో పాటు తెలుగులోనూ థియేటర్లలో రిలీజై హిట్ కొట్టింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇంతకీ ఆ చిత్రం సంగతేంటి? ఎందులో రానుంది?
'ప్రేమలు' హీరో నస్లేన్ నటించిన లేటెస్ట్ మూవీ 'జింఖానా'. ఏప్రిల్ 10న మలయాళ వెర్షన్ రిలీజ్ కాగా.. ఇదే నెల చివర్లో తెలుగు వెర్షన్ థియేటర్లలోకి వచ్చింది. పాజిటివ్ టాక్‌తో పాటు ఓ మాదిరి కలెక్షన్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రం సోనీ లివ్ ఓటీటీలో జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుందని అధికారికంగా ప్రకటించారు.
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు)
'జింఖానా' సినిమా విషయానికొస్తే.. అలప్పుజాకు చెందిన ఆకతాయి కుర్రాళ్లు జాన్సన్ (నస్లేన్)తో పాటు మరో ఐదుగురు ఫ్రెండ్స్. వీళ్లలో షణవాస్ అనే కుర్రాడు తప్పితే మిగిలిన వాళ్లంతా 12వ తరగతిలో ఫెయిల్. దీంతో డిగ్రీ చదవాలంటే స్పోర్ట్స్ కోటా ద్వారా వెళ్లాలనుకుంటారు. అలా బాక్సింగ్ నేర్చుకుంటారు. స్థానికంగా 'అలప్పుజా జింఖానా' అకాడమీలో శిక్షణ తీసుకోవడం ప్రారంభిస్తారు. స్థానిక పోటీల్లో ఎలాగో గెలిచిన కుర్రాళ్ల గ్యాంగ్.. కేరళ స్టేట్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొనేందుకు రెడీ అవుతుంది. ఫ్రొఫెషనల్ ఆటగాళ్లు ఉండే ఆ బాక్సింగ్ పోటీల్లో ఈ ఆకతాయి గ్యాంగ్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? గెలిచారా లేదా అనేది మిగతా స్టోరీ.
ఇక ఈ వీకెండ్ దాదాపు 30కి పైగా కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. వీటిలో సింగిల్, జాట్, లాల్ సలామ్, గ్రౌండ్ జీరో, భోల్ చుక్ మాఫ్, జిగేల్, స్టోలెన్ సినిమాలు కాస్త చూడదగ్గవిగా అనిపిస్తున్నాయి. వడక్కన్, ఓ యుముడి ప్రేమకథ లాంటి డబ్బింగ్ చిత్రాలు కూడా వచ్చాయి. వీటితో పాటు 'దేవిక & డానీ' అనే తెలుగు సిరీస్ కూడా కాస్త ఆసక్తి కలిగిస్తోంది.
(ఇదీ చదవండి: హిందీ హీరో చేసిన తెలుగు ఫ్లేవర్ సినిమా.. 'జాట్' ఓటీటీ రివ్యూ)
Watch the group that trained for marks…and ended up fighting for much more.#AlappuzhaGymkhana streaming from 13th June on Sony LIV#AlappuzhaGymkhana #AlappuzhaGymkhanaOnSonyLIV#NaslenKGafoor #LukmanAvaran #AnaghaMayaRavi #GanapathiSPoduval #BabyJean #SandeepPradeep pic.twitter.com/oEikMxNAQ5
— Sony LIV (@SonyLIV) June 6, 2025